Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ దుమ్ముదులిపేశాడు


రెండు ప్లాప్ ల తర్వాత పూరి జగన్నాధ్ తో పాన్ ఇండియా ఫిలిం చేస్తున్న విజయ్ దేవరకొండ గత నెల రోజులుగా వార్తల్లోనే నిలుస్తున్నాడు. కరోనాపై టాలీవుడ్ యుద్ధం ప్రకటించి.. చిరు ఆధ్వర్యంలో ఫండ్ రైసింగ్ స్టార్ట్ చేసినప్పుడు విజయ్ దేవరకొండ కామ్ గా సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత విజయ్ దేవరకొండ పోలీసులకు అండగా నిలవడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం ఫండ్ రైసింగ్ మొదలెట్టాడు. అయితే విజయ్ దేవరకొండ కారోనాపై మొదట్లో సైలెంట్ గా ఉండడంపై  కొన్ని వెబ్ సైట్స్.. విజయ్ మీద నెగెటివ్ న్యూస్ లు ప్రచురించడంతో విజయ్ దేవరకొండకి బాగా కోపం వచ్చింది.

Advertisement
CJ Advs

అందుకే తాజాగా విజయ్ దేవరకొండ సదరు వెబ్ సైట్స్ పై విరుచుకుపడ్డాడు. సినీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వెబ్ సైట్స్ చాలావరకు ఫేక్ న్యూస్ లు రాస్తూ డబ్బు  సంపాదిస్తున్నాయని, విజయ్ దేవరకొండని ఇంటర్వూస్ చేస్తామని అడిగితే ఒప్పుకోకపోతే.. విజయ్ దేవరకొండపై తప్పుడు ప్రచారం చేస్తారా? విజయ్ దేవరకొండ దాక్కున్నాడు? దేవరకొండ మిస్సింగ్? అంటూ చాలా వెబ్ సైట్స్ రాసాయని.. తాను నిజాయితీగా విరాళాలు సేకరిస్తుంటే అందులోను గందరగోళం జరుగుతుందని... ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే వాళ్లలో కొద్ది మందికే విజయ్ సహాయం అందుతుందని.. ఇంకా ఏవేవో న్యూస్ లు నా మీద రాస్తూ నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని... మీరు  బ‌తికేదే మామీద‌... యాడ్లు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌క‌పోతే.. ఇలాంటి గాసిప్స్, ఫేక్ న్యూస్ లు రాసి డబ్బులు సంపాదిస్తారు. అసలు నన్ను విరాళాల మీద ప్రశ్నించడానికి మీరెవరు అటూ విజయ్ దేవరకొండ వెబ్సైట్ పేర్లు చెప్పకుండా దుమ్ముదులిపి ఆరేసాడు.

Vijay Deverakonda Serious on Websites Fake News :

Vijay Deverakonda Fires on Gossipmongers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs