Advertisement
Google Ads BL

‘80’స్ ఆంటీస్‌తో డ్యాన్స్ మరువలేకున్న చిరు!


టాలీవుడ్‌లో నాటికి నేటికీ డ్యాన్స్ విషయంలో చిరును ఢీ కొట్టే హీరోనే లేడు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ‘బంగారు కోడిపెట్టా..’ అని దుమ్ములేసేలా స్టెప్పులేసినా ‘రత్తాలు రత్తాలు’ అంటూ రంజింపచేయాలన్నా చిరు తర్వాతే ఎవరైనా. అలాంటి చిరు ‘80’స్‌లోని ఆంటీస్‌‌తో గత ఏడాది తన కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా అందరితో డ్యాన్స్ చేసి ఇరదీశారు. అప్పట్లో ఆ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. రీల్ కాకుండా రియల్ లైఫ్‌లో అలా డ్యాన్స్ అదరగొట్టేయడంతో పదే పదే చిరు గుర్తు చేసుకుంటున్నాడు. అసలు మరిచిపోదామన్నా మరుపురావట్లేదేమో కానీ తాజాగా మరోసారి తన ట్విట్టర్ వేదికగా వైరల్ చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులు, సినీ ప్రియులు కామెంట్ల వర్షం కురిపిస్తూ.. పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇంతకీ వీడియోలో ఏముంది..!

తన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘ఘరానా మొగుడు’లోని ‘బంగారు కోడిపెట్ట..’ సాంగ్‌కు చిరు స్టెప్పులేశారు. మొదట ఖుష్బూతో.. ఆ తర్వాత జయసుధతో చిరు డ్యాన్స్ చేశారు. ఈ స్టెప్పులను బట్టి చూస్తే.. నాటికి నేటికి చిరు డ్యాన్స్‌లో నాటికి నేటికీ ఎలాంటి మార్పు రాలేదని తెలిసిపోతుంది. అంతేకాదు ఒకప్పుడు తనకు పోటీగా డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించిన రాధతో కూడా స్టెప్పులేసి ఇరగదీశారు. ఈ వీడియోలో సుహాసినీ, జయప్రద, సుమలత, నదియా, భాగ్యశ్రీ, రమ్యకృష్ణ, లిజీ, పూర్ణిమ భాగ్యరాజ్‌తో పాటు పలువరు ఇంకా చాలా మంది ‘80’స్ ఆంటీస్ ఉన్నారు. ఇందులో హీరోలు వెంకటేష్, భానుచందర్, నరేష్, సురేష్ లాంటి చాలా మంది స్టార్స్ కూడా ఉన్నారు. ఆలస్యమెందుకు చిరు ట్విట్టర్ ఖాతాలోకి వెళ్లి మీరూ ఆ వీడియోను ఓ లుక్కేయండి.

Chiru Didnt Ignore Dance with 80’s Aunties!:

Chiru Didnt Ignore Dance with 80’s Aunties!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs