Advertisement
Google Ads BL

ఫ్యాన్స్ కోసం ‘ఆచార్య’లో చరణ్‌ రోల్ పెంచుతున్నారు


చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా కరోనా లాక్‌డౌన్‌తో అందరికన్నా ముందే షూటింగ్ వాయిదా పడింది. అయితే ఆచార్య షూటింగ్ వాయిదా పడినప్పటికీ.. మెగా ఫ్యాన్స్‌కి ఆచార్య టీం ఎప్పుడూ ఏదో ఒక ట్రీట్ ఇస్తూనే ఉంది. ట్రీట్ అంటే ఫస్ట్ లుక్ కానీ, పోస్టర్ లుక్ కానీ, టీజర్ కానీ అలాంటివేం కాదు కానీ.. ఆచార్య సినిమా విషయాలను తెరలు తెరలుగా సోషల్ మీడియాకి వచ్చి చేరుతున్నాయి. కొరటాల శివ దగ్గరనుండి, చిరు వరకు ఆచార్య ముచ్చట్లను మెగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక ఆచార్యలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర సినిమాకే చాలా కీలకమని కొరటాల శివ చెప్పాడు.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ కనుక RRR చెయ్యడానికి కుదరకపోయినా మహేష్ సై అంటున్నాడు. అంటే ఆ పాత్ర ఎంత కీలకమో అర్ధమవుతుంది. రామ్ చరణ్ పాత్రకి హీరోయిన్ కూడా ఉంటుంది కానీ.. ఇంకా ఆమెని ఫైనల్ చెయ్యలేదని చెప్పాడు కొరటాల శివ. అయితే తాజాగా స్టార్ హీరో చిరు కొడుకు చిరు సినిమాలో ఓ పాత్ర అంటే... అది ఎంత పవర్ ఫుల్ అయ్యింటుందో అందరికీ అర్థమవుతుంది. అయితే రామ్ చరణ్ పాత్రని అలా అలా కీ రోల్ కే పరిమితం చెయ్యకుండా ఓ హీరోయిన్, ఓ ఐటెం సాంగ్ ని కూడా కొరటాల సెట్ చేశాడట. మొదటగా ఆ పాత్రకి హీరోయిన్ కానీ, ఐటెం సాంగ్ కాని అనుకోలేదట. కానీ రామ్ చరణ్ చేస్తుంటే.. మరీ రామ్ చరణ్ ని సోలో గా చూపిస్తే మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతారని.. అందుకే వాళ్ళని మెప్పించడానికి కొరటాల ఓ హీరోయిన్‌తో డ్యూయెట్‌ని, ఓ ఐటెం సాంగ్‌ని సెట్ చేస్తున్నాడంట. 

Latest Update on Charan role in Acharya :

Special Duet and Item song Added in Acharya for Ram Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs