జబర్దస్త్ నుండి జీ ఛానల్ అదిరింది షో లోకి చాలామంది కమెడియన్స్ జంప్ అయ్యారు. నాగబాబుతో పాటుగా చాలామంది కమెడియన్స్ వెళ్లిపోయారు. ఇంకా కొంతమంది ఫేమ్ ఉన్న కమెడియన్స్ మాత్రం జబర్దస్త్ ని వదల్లేదు. తాజాగా గెటప్ శీను ని జబర్దస్ నుండి నాగబాబు తో పాటుగా చాలామంది కమెడియన్స్ అదిరిందికి వెళ్లారు కదా... మీరెందుకు వెళ్ళలేదు... దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా.. ఎవరికివారు సొంతంగా పేరు తెచ్చుకోవాలని చాలామంది అనుకుంటారు. అలాగే నితిన్, భరత్ కూడా సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని అదిరింది షో మొదలెట్టారు.
వాళ్లతో మేము చాలా క్లోజ్ గా ఉంటాము. బావా బావా అని పిలుచుకుంటుంటాం. ఇకనాగబాబుగారు వాళ్ళ టాలెంట్‌ని ఎంకరేజ్ చెయ్యడానికి అదిరింది షోకి వెళ్లారు. మేము ఇక్కడే ఉన్నాం. కొంతమంది జబర్దస్‌ని వదిలేసినా... మేము రిస్క్ ఎందుకు.. ఇక్కడ జబర్దస్త్ లో బాగానే ఉంది కదా అని ఇక్కడే ఉండిపోయాం అని చెబుతున్నాడు. జబర్దస్త్ ని కొన్ని కోట్లమంది ప్రేక్షకులు చూస్తారు.. ప్రాణం పెట్టి చెయ్యాలి అని నాగబాబుగారు ఎప్పుడూ చెబుతుండేవారు. అలాగే రోజాగారు కూడా ఎమ్మెల్యే అయ్యాక కూడా జబర్దస్త్ ని వదలనని చెప్పారు. జబర్దస్త్ నా ప్రాణం అని చెబుతుంది ఆవిడ. అసలు జబర్దస్త్ షో వలనే నేను ఎమ్మెల్యేను అయ్యాను అని చెబుతుంటారు ఆవిడా అంటూ నాగబాబు, రోజాల గురించి, జబర్దస్ ని ఎందుకు వదల్లేదు అనే దాని గురించి జబర్దస్త్ శీను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.