హీరోయిన్స్ ప్రేమలో పడడం.. తర్వాత ఆ ప్రేమలో మోసపోవడం, చివరికి నమ్మకం లేక బ్రేకప్ చెప్పేశా అంటుంటారు. నయనతార రెండుసార్లు ప్రేమలో నమ్మకం లేకనే... వాళ్లతో విడిపోయా అని చెబితే.. తాజాగా మరో హీరోయిన్ కూడా ప్రేమలో మూడుసార్లు మోసపోయాను అంటుంది. తెలుగులో స్టార్ రేంజ్ కి చేరకపోయినా.. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసిన రత్తాలు ఈమధ్యన అవకాశాలు లేక బికినీ వేసి ఆఫర్స్ పట్టాలని కలలు కంటుంది. రకరకాల బికినీ ఫోజుల్తో అదరగొడుతున్న లక్ష్మి రాయ్.. ప్రేమలో చాలాసార్లు మోసపోయిందట.
లక్ష్మి రాయ్ సినిమాల విషయాలకన్నా ఎక్కువగా లవ్ ఎఫైర్స్ తోనే ఫేమస్ అయ్యింది. గతంలో క్రికెటర్ ధోనితో లక్ష్మి రాయ్ ప్రేమాయణం నడిపింది అని ప్రచారం జరిగింది. ఇక తాజాగా తాను గతంలో చాలాసార్లు ప్రేమలో పడ్డా అని, తనకి ఎన్నో బ్రేకప్స్ కూడా అయ్యాయని చెబుతుంది. మూడుసార్లు ప్రేమలో తాను మోసపోయినట్లుగా చెప్పింది. మరి ఆ మోసం చేసిన ముగ్గురు ఎవరనేది చెప్పలేదు కానీ.. ప్రేమలో మోసపోయా అని మాత్రం చెబుతుంది.