Advertisement
Google Ads BL

చివరికి ‘నిశ్శబ్దం’గా ఓటిటిలో వచ్చేస్తుందా?


కరోనా లాక్ డౌన్‌తో సినిమా రంగం కుదేలయ్యింది. అన్ని రంగాలు కరోనాతో అతలాకుతలం అయ్యాయి. లాక్ డౌన్ ని మే 3 నుండి మళ్ళీ మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం ఇండియా వైడ్‌గా పొడిగించింది. మే 3 తర్వాత యధావిధిగా లాక్ డౌన్ ముగిసి పనులు మొదలవుతాయనుకుంటే.... మళ్ళీ 17కి మారడంతో నిర్మాతలు ఇబ్బందులు మరిన్ని పెరిగాయి. సినిమాలు విడుదల మళ్ళీ వాయిదాలు పడ్డాయి. దానితో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్‌కి ఆశలు చిగురించాయి. ఇప్పటివరకు నిర్మాతలు ఒప్పుకునేటట్టుగా కనిపించినా హీరోలు ఒప్పుకోలేదు. ఓటిటిలో తమ సినిమాలు విడుదలవడం ఇష్టం లేదు... థియేటర్స్‌లో విడుదలయ్యేవరకు ఆగాలని పట్టుబట్టారు.

Advertisement
CJ Advs

తాజాగా లాక్ డౌన్ పొడిగించడంతో హీరోలు కూడా ఓటిటి కి టెంప్ట్ అయ్యేలా కనబడుతున్నారు. ఇక నిశ్శబ్దం సినిమాని ఓటిటి నుంచి విడుదల చేస్తామని అన్నప్పటికీ.. మొన్నామధ్యన అలాంటిదేం లేదు మా సినిమా థియేటర్స్ లోనే విడుదలకానుంది అన్నారు. తాజాగా నిశ్శబ్దం నిర్మాత హేమంత్ తమకి ఓటిటి నుండి భారీ ఆఫర్స్ వచ్చాయని.. కానీ మూవీ యూనిట్ మొత్తం సినిమాని థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని అన్నారని.. ఇక నిశ్శబ్దం మూవీ తెలుగు వెర్షన్ కంప్లీట్ అయినా...తమిళ, హిందీ, మలయాళ వెర్షన్ కి సంబందించిన పనులు మిగిలే ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యాకే సినిమా విషయంలో పునరాలోచిస్తామని, సినిమాని థియేటర్స్ లో విడుదల చెయ్యాలా... ఓటిటి లో విడుదల చెయ్యాలా.. లేదా అనేది మెజారిటీ మెంబెర్స్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని చెప్పడంతో.. నిశ్శబ్దం సినిమా చివరికి ఓటిటి నుండే బయటకి వచ్చేలా కనబడుతుంది అంటున్నారు.

nishabdham Producers in dilemma on Movie release:

nishabdham Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs