Advertisement
Google Ads BL

పుట్టినరోజు అతనిది.. హంగామా వీళ్ళది..


సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి వాటికి ఊతమిచ్చింది తమిళ నటులు విజయ్ - అజిత్ ల అభిమానులే. విజయ్ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల హంగామాని నీరు కార్చడానికి అజిత్ అభిమానుల చేసే సందడి అంతా ఇంతా కాదు. అలాగే విజయ్ అభిమానులు కూడా అజిత్ సినిమా రిలీజైందంటే అలాగే చేస్తారు. సినిమాల రిలీజ్ వరకి కూడా కాదు. ఒక్క పోస్టర్ రిలీజ్ చేసినా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి ఒకరు ప్రయత్నిస్తుంటే, మరొకరు దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు.

Advertisement
CJ Advs

తాజాగా నేడు మళ్లీ వీరిద్దరి అభిమానుల మధ్య యుద్ధం నడుస్తోంది. నేడు అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు దేశవ్యాప్తంగా ట్రెండ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, విజయ్ అభిమానులు వారికి అడ్డుపడే విధంగా విజయ్ ది ఫేస్ ఆఫ్ కొలీవుడ్ అంటూ ట్యాగ్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఫలితం,  అజిత్ బర్త్ డే కన్నా విజయ్ పైనే ఎక్కువ ట్వీట్లు పడుతున్నాయి. దీంతో విజయ్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. 

ఒకరి ఆనందాన్ని చెడగొట్టి, తాము ఆనందపడటం పైశాచికం అని తెలిసి కూడా ఈ ఇద్దరి హీరోల అభిమానులు ప్రతీ సారీ ఇలాగే కొట్టుకుంటుంటారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయితేనే, ట్రెండింగ్ లో ఉన్నట్టు అనుకునే వాళ్లకి ఎన్ని చెప్పినా మారరని తటస్థులు అభిప్రాయపడుతున్నారు.

Fan war on social media :

fan war on social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs