కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. దీంతో సొంతూళ్ల నుంచి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లిన వలస కార్మికులు నానా తంటాలు పడుతున్నారు. వారిని స్వగ్రామాలకు తరలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కార్మికులను గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో రప్పిస్తున్నారు. ఇంకా వేల సంఖ్యలో కూలీలను తరలించాల్సి ఉంది. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తోంది.
ఇవాళ.. ‘మే’ డే అనగా.. ప్రపంచ కార్మికుల దినోత్సవం కావడంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విషెస్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కాస్త ఆలోచింపజేస్తోంది. ‘ఇవాళ మేడే.. ప్రపంచ నిర్మాణం వారి వల్లే జరిగింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికుల గురించి ప్రపంచ కార్మిక దినోత్సవాన ఒక్కసారి ఆలోచిద్దాం. వారు అసాధారణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు’ అని చిరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పరోక్షంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉద్దేశించి చేసినదే. మంచి విషయమే కాబట్టి ఇందులో ఎలాంటి విమర్శలు అక్కర్లేదు. చిరు ట్వీట్‌పై పలువురు ప్రముఖులు, నెటిజన్లు, మెగాభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు.
కాగా.. ఇకపై వలస కార్మికులకు ఇబ్బందులు ఉండకూడదని మరీ ముఖ్యంగా మత్స్య కార్మికులు ఇకపై ఇలా వలస వెళ్లకూడదని భావించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి కోసం రాష్ట్రంలో ఎనిమిది హార్బర్లును ఏర్పాటు చేయబోతున్నట్లు.. ఇందుకు భారీగానే నిధులు సైతం కేటాయిడం జరిగింది. ఇలా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూలీలకు ఉపాధి కల్పిస్తే వలస తిప్పలు తప్పుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.