Advertisement
Google Ads BL

కాజల్ అగర్వాల్ ఎందుకిలా చేస్తోందబ్బా..!?


కాజల్ అగర్వాల్‌.. మొదట్లో వరుస అవకాశాలతో టాలీవుడ్, కోలీవుడ్‌ను దున్నేసింది. ఆ తర్వాత కొంతమంది కొత్త నటీమణులు ఎంట్రీ ఇవ్వడంతో అవకాశాలు తగ్గిపోయాయ్. కానీ ఈ మధ్య వరుసగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్నాయ్. సీనియర్ హీరోల సినిమాలు అంటే చాలు మొదట కాజల్‌నే ఎంపిక చేస్తున్నారు. అయితే చేజేతులారా అవకాశాలు కూడా వదిలేసుకుంటోంది. తాజాగా ఈ భామకు బంపరాఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా స్టార్ హీరో సరసన అయ్యే సరికి ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేవట.

Advertisement
CJ Advs

సీక్వెల్ సినిమాలో..

అసలు విషయానికొస్తే.. గతంలో తమిళ్ కమ్ తెలుగులో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘తుపాకి’ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. అందుకే ఇదే కాంబోలో సీక్వెల్ సినిమా చేయడానికి మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే కాజల్‌ను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. లాక్ డౌన్‌తో ఇంట్లోనే ఉన్న మురుగదాస్ సీక్వెల్ కథను సిద్ధం చేశాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే కరోనా కష్టకాలం గడిశాక సీక్వెల్ సినిమా షూటింగ్ పట్టాలెక్కుతుందని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే కాజల్‌ బంపరాఫర్ దక్కినట్లే.

టాలీవుడ్‌కు రాం రాం ఎందుకో!

మెగస్టార్ చిరంజీవి-హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకున్నాక కాజల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే కాజల్‌ కూడా తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ మూవీ నుంచి తప్పుకున్నాకా ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జోడీగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు.. ఇప్పటికే బల్క్‌గా డేట్స్ కూడా ఇచ్చేసిందని టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభం కానుందట. కాజల్ పెద్ద పెద్ద హీరోల సినిమాలకు ఒప్పుకొని.. ఆపై తప్పుకుని ఇలా వరుసగా కోలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే కాజల్ ఎందుకిలా చేస్తోందబ్బా..? ఇంతకీ ఈ బ్యూటీకి ఏమైందా అని అభిమానులు అనుకుంటున్నారు. మరి కాజల్ గురించి వస్తున్న ఈ వరుస వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే క్లారిటీ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

What Happend To Actress Kajal Agarwal!:

What Happend To Actress Kajal Agarwal!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs