Advertisement
Google Ads BL

నిహారిక గ్లామర్, ఆరబోత సరే.. గ్రేస్ మిస్!


మెగా ఫ్యామిలీ నుంచి క్రికెట్ టీమ్ లాగా చాలా మంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. దాదాపు అందరూ సక్సెస్సే అయ్యారు. అయితే హీరోయిన్‌గా అడుగుపెట్టిన నిహారిక మాత్రం అస్సలు సెట్ అవ్వలేకపోతోంది. ఇంతవరకూ ఈమె ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ పడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా హీరోలకు మాత్రం అచ్చొచ్చిన టాలీవుడ్.. మెగా డాటర్స్‌కు అచ్చిరాలేదన్న మాట. దీంతో సినిమాల్లో నటించడం దాదాపు నిహారిక మానేసింది. ఆ తర్వాత ఏదో అప్పుడప్పుడు టీవీ షోలో.. వెబ్ సిరీస్‌లో.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కైపెక్కిస్తోంది.

Advertisement
CJ Advs

అసలు కథ ఇదీ..

తాజాగా.. డ్యాన్స్ మాస్టర్ యశ్వంత్‌తో కలిసి స్పెప్పులేసింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో హాట్ హాట్ స్టెప్స్‌లో నిహారిక వేసిన స్టెప్స్ చూసిన జనాలు మతిపోయింది. గ్లామర్ ఓకే.. కావాల్సినవన్నీ చూపించేసింది అదీ ఓకే కానీ.. గ్రేస్ మాత్రం చూపించలేకపోయింది. దీంతో అన్నీ సరే అసలైందే తక్కువైంది నిహారిక అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ డ్యాన్స్ చూస్తుంటే.. ఆమెలో డ్యాన్స్ చేయాలనే తపన కనిపిస్తున్నప్పటికీ అంతకుమించి తనలోని గ్లామర్ యాంగిల్ బయటపెట్టుకోవడానికి పరితపిస్తోందని తెలుస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో నిహారిక హాట్ హాట్‌గా అందాలు ఆరబోసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడాలనుకుంటే నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఓ లుక్కేయండి.

టాక్ ఏంటి!?

ఇప్పటి వరకూ నిహారిక ఖాతాలో సింగిల్ హిట్ కూడా పడలేదు. దీంతో ఇక రూట్ మార్చేయాలని గ్లామరస్ రోల్స్ చేయాలని తెగ ప్రయత్నిస్తోందని టాక్ నడుస్తోంది. అందుకే ఇప్పుడు డ్యాన్స్‌లు తెగ ప్రాక్టీస్ చేస్తోందని తెలుస్తోంది. మరి ఇకనైనా మంచి మంచి సినిమాలు చేసే చాన్స్ దక్కుతుందేమో చూడాలి. ఇటీవలే.. నిహారిక ‘ఆచార్య’లో అతిథి పాత్రలో నటిస్తోందని వార్తలు వినిపించాయి. తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు సయోధ్యతో కొరటాల ఈ పాత్ర ఇచ్చినట్లు కూడా టాక్ నడుస్తోంది. మొత్తానికి చూస్తే.. తాజా వీడియోతో ఎలాంటి పాత్రల్లో అయినా నటిస్తానని.. తనకు హ‌ద్దులు ఏమీ లేవనే చెప్పకనే చెబుతోందన్న మాట.

Niharika Dance Video Viral.. But..!:

Niharika Dance Video Viral.. But..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs