బాలీవుడ్‌లో కంగనాతో పెట్టుకోవాలంటే పెద్ద దర్శకనిర్మాతలు, హీరోలే టెన్షన్ పడతారు. ఎవ్వరినైనా కంగనా కేర్ చెయ్యదు. ఆమెకి రంగోలి అనే చెల్లి... సపోర్ట్ ఉంది. రంగోలి కంగనా మీద ఎవరైనా విమర్శలు చేసినా.. లేదంటే కంగనాని తక్కువ చేసినా అస్సలు ఊరుకోదు. ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతుంది. కంగనా సిస్టర్స్ తో పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. బాలీవుడ్ బడా హీరో హ్రితిక్ రోషన్ కంగనాతో డేటింగ్ చేసి అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇప్పటికి హ్రితిక్ రోషన్ ని కంగనా వదలదు. హృతిక్ పై దుమ్మెత్తి పోస్తూనే ఉంటుంది. తాజాగా మరో బాలీవుడ్ హీరో కంగనాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఏకరువుపెడుతున్నాడు. కంగనాతో హృతిక్ రోషన్ కన్నా ముందే డేటింగ్ చేసిన హీరో అధ్యాయన్ సుమన్ .. కంగనా వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడో చెబుతున్నాడు.
కంగనాతో డేటింగ్ చేసిన అధ్యాయన్ సుమన్ కొన్ని కారణాల వలన కంగనాతో విడిపోయినప్పుడు అధ్యాయన్ సుమన్ కి ఎవరూ మద్దతు పలకలేదట. అయితే కంగనాతో సుమన్ విడిపోవడంపై నటి కవిత కౌశిక్ తాజాగా స్పందించింది. హీరో అధ్యాయన్ సుమన్ ని కంగనా చాలా దారుణంగా కష్టపెట్టి.. విమర్శించింది అని ట్వీట్ చేసింది. అయితే సుమన్ కూడా తాను కంగనాతో విడిపోయినప్పుడు ఎవరూ తనకి మద్దతు తెలపలేదని, కానీ కంగనా తో డేటింగ్ లో ఉన్నప్పుడు కంగనా తనని, తన కుటుంబ సభ్యులను చాలా ఇబ్బందులు పెట్టింది అని... చాలా బాధపెట్టింది అని... కంగనాతో విడిపోయాక తాను తన ఫ్యామిలీ సంతోషంగా ఉన్నామని.. అసలు కంగనాతో విడిపోయాకే తాను జీవితంలో ముందుకెళ్లినట్టుగా చెబుతున్నాడు.