Advertisement
Google Ads BL

ఆసక్తికరంగా ఉన్న ‘A’ సినిమా టైటిల్ పోస్టర్


ఊహకు అందని అనూహ్యమైన సస్పెన్స్ మెడికల్ థ్రిల్లర్ ‘A’ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

అవంతిక ప్రొడక్షన్స్ “A” (AD-INFINITUM) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నితిన్ ప్రసన్న, ప్రీతీ అశ్రాని(మళ్లీరావా, ప్రెజర్ కుక్కర్), బేబీ దీవెన (జబర్దస్త్); రంగాథం; కృష్ణవేణి; భరద్వాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసిన యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  

ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా కథాంశం చాలా అనుహ్యమైనది, ఇప్పటివరకు ప్రపంచ సినిమాల్లో కూడా రానటువంటి ఒక విభిన్నమైనటువంటి కథ. 1977 నుండి 2019 మధ్య ఈ కథ నడుస్తుంది అన్నారు. దర్శకునితో సహా మిగిలిన టెక్నీషియన్స్ అందరూ కూడా ఫిల్మ్ స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్లు కావటంతో సినిమా టెక్నికల్ గా అద్భుతంగా వచ్చిందని తన ఆనందం వ్యక్తపరిచారు. నటీనటుల కోసం దాదాపు నాలుగు నెలల్లో 300కి పైగా ఆడిషన్స్ చేసినట్లు తెలిపారు. ఖచ్చితంగా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు ఒక క్రొత్త అనుభూతిని మరియూ సంతృప్తిని ఇస్తుంది. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా శంషాబాద్ దగ్గర్లో ఒక సెట్‌ను నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించటం జరిగిందని తెలిపారు.

An Unimaginable Medical Thriller ‘A’ Title Poster Release:

‘A’ Title Poster Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs