ఆ సినిమా నుంచి ఆయనంటే క్రష్ : అనసూయ


అనసూయ భరద్వాజ్.. ఇటు బుల్లి తెరపై.. అటు వెండి తెరపై ఓ మెరుపు మెరుస్తోంది. వీటితో పాటు సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత కూడా. దీంతో ఓ హీరోయిన్ రేంజ్‌లో ఈ హాట్ యాంకరమ్మకు ఫాలోయింగ్.. ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఈ హాట్ భామ మంచి మంచి పాత్రల్లోనే సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’, ‘యాత్ర’ సినిమాలోని పాత్రలు బహుశా మున్ముంథు ఎప్పుడూ రావేమో. అలాంటి పాత్రల్లో నటించి మెప్పించి ఆదరాభిమానులు పొందింది. ఈ పాత్రలు చూసిన తర్వాతే చాలా మంది పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. 

ఇక అసలు విషయానికొస్తే.. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నారు. మీడియాకు ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు ఇవ్వడం.. లేదా ఫేస్‌బుక్‌లో లైవ్ ఇవ్వడం.. ఇదీ కాకుంటే ఆస్క్ విత్ ఫలానా నటీ లేదా నటుడు అంటూ లైవ్‌లోకి రావడం చేస్తున్నారు. తన అభిమానుల కోసం అభిమానులతో తాజాగా హాట్ భామ కమ్ యాంకర్ అనసూయ చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా మీకు ఏ హీరో అంటే ఇష్టం.. ఎవరితో క్రష్ అని అని అభిమానులు ప్రశ్నించగా కింది విధంగా బదులిచ్చింది.

నా క్రష్ ఆయనే..

‘నా పేవ‌రేట్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్. జెంటిల్‌మేన్ సినిమా చూసి ఆయనకు అభిమానిగా మారిపోయాను. ఆ సినిమా నుంచి అర్జున్ అంటే నాకు క్రష్ ఏర్పడింది’ అని అనసూయ చెప్పుకొచ్చింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆణిముత్యాల్లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌ని అల‌రించిన కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రంలో ఈ భామ నటిస్తోందని వార్తలు వస్తున్నాయ్. ఇందులో దేవదాసిగా నటిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గుడిలోనే ఓ ప్రత్యేకపాట కూడా ఉంటుందట.

Hot Anchor Anasuya Crush With These Hero..!:

Hot Anchor Anasuya Crush With These Hero..!  
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES