Advertisement
Google Ads BL

చివరి క్షణాల్లో ఇర్ఫాన్ ఖాన్ అన్న మాటలివీ..


బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన కేన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు విషాదంలో మునిగిపోయింది. దాదాపు అన్ని భాషల్లో ఇర్ఫాన్ నటించి మెప్పించారు. మరీ ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలతో ఆయనకు చాలా మంచి అనుబంధం ఉంది. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సినీ నటీనటులు కంటతడిపెట్టారు. 2018 నుంచి అరుదైన కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అనుకుంటున్న సమయంలో తల్లి సయిదాబేగం కన్నుమూయడంతో మరింత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం నాడు పరిస్థితి విషమించి తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు.

Advertisement
CJ Advs

అలా అనుకున్నాడు కానీ..

ఇర్ఫాన్ చనిపోక ముందు అంటే చివరి క్షణాల్లో కుటుంబీకులతో మాట్లాడిన మాటలు అందర్నీ కంటతడిపెట్టిస్తున్నాయి. ‘నన్ను తీసుకెళ్లడానికి మా అమ్మ పైనుంచి వచ్చింది.. అమ్మ దగ్గరికి వెళ్లిపోతున్నా.. జాగ్రత్త’ అని చివరి క్షణాల్లో అన్నారని కుటుంబ సభ్యులు, ఆయనతో ఉన్నవారు చెబుతున్నారు. చివరి క్షణాల్లో కూడా అమ్మ గురించే చెప్పాడంటే.. ఇర్ఫాన్‌కు తన తల్లి అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ వార్త విన్న అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇలాంటి నటుడ్ని ఇక చూడలేమని బాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు నటీనటులు తమ ప్రగాఢ సంతాపం తెలిపి.. కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని చెబుతున్నారు.

నా భార్య కోసమే..

కాగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి చెబుతూ ఇర్ఫాన్ కంటతడిపెట్టుకున్నారు. నా భార్య సూతాప సిక్దార్ కోసం నేను కేన్సర్‌ను జయించి బతుకుదాం అనుకున్నాను. నాకు కేన్సర్ అని తెలిసినప్పట్నుంచీ నా భార్య నన్ను అస్సలు వదల్లేదు. 24 గంటలూ నన్ను చూసుకుంటూనే ఉండేది. నేను ఇవాళ ఇలా ఉన్నానంటే నా భార్య నాకు చేసిన సేవలు, ఆమె నాలో నింపిన ప్రోత్సాహమే. అందుకే ఆమె కోసం బతుకుదాం అనుకున్నాను అని ఇర్ఫాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇలా అనుకున్న ఇర్ఫాన్‌ను భగవంతుడు అప్పుడే తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు.

My mother came for me says irrfan khan Last minute:

My mother came for me says irrfan khan Last minute  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs