ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా చెయ్యడానికి స్టార్ హీరోలే కాదు.. మీడియం హీరోలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడూ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ మీడియం హీరో నితిన్‌తో అ.. ఆ సినిమా చేసాడు. తాజాగా అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితోనో అనగానే.. ఎన్టీఆర్ లైన్ లోకి వచ్చి సినిమా ప్రకటించాడు. RRR షూటింగ్ తో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి జాయిన్ అవుతాడనుకుంటే.. కరోనా లాక్ డౌన్ వలన ప్రస్తుతం RRR షూటింగ్ లేట్ అవడం, ఎన్టీఆర్ ఇంకా RRR లుక్ లోనే ఉండాల్సి రావడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ లేట్ అయ్యేలా కనబడుతుంది.
అయితే ఎన్టీఆర్ రావడం లేటయితే.. త్రివిక్రమ్ మరో యంగ్ హీరోతో అ.. ఆ లాంటి మీడియం మూవీని చేసే ప్లాన్ లో ఉన్నాడని.. దాని కోసం ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ సిద్ధం చెయ్యడమే కాదు... ఆ కథ కోసం నాని కానీ నాగ చైతన్య ని కానీ సంప్రదించే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని.. ఒకవేళ ఎన్టీఆర్ లేట్ అవుతున్నాడని తెలిస్తే.. వెంటనే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరితో మీడియా బడ్జెట్ మూవీని పట్టాలెక్కించే ప్లాన్‌లో త్రివిక్రమ్ ఉన్నాడని తెలుస్తుంది. మరి త్రివిక్రమ్ అడిగితే నాని కానీ, చైతు కానీ కాదనరు.. ఎందుకంటే అలాంటి డైరెక్టర్ తో ఓ సినిమా వాళ్ళకి పడితే.. వాళ్ళ పంట పండినట్లే.