Advertisement
Google Ads BL

ఈ బ్యూటీస్‌కు నో ఛాన్స్.. ఓన్లీ పాపులర్!


టాలీవుడ్‌లో కొత్త కొత్త అందాల భామలు వస్తుండటంతో.. అంతకు మునుపు తన అంద చందాలతో ఇండస్ట్రీని ఏలేసిన ముద్దుగుమ్మలు వెనకపడిపోతున్నారు. అలా వచ్చిన వారిలో ఫలానా అని ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే కొత్త భామలు రెండు మూడు సినిమాల్లో మెరిసే వారు కూడా మరుగున పడిపోతున్నారు. ఆ తర్వాత వాళ్లు అవకాశాల కోసం వేచి చూస్తుండటం.. ఇదిగో ఫలానా సినిమా దర్శకనిర్మాత ఆమెను సంప్రదించాడట అని పుకార్లు రావడం.. అలా వార్తల్లో నిలుస్తున్నారే తప్ప అవకాశాలు మాత్రం అస్సలే రావట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అలా ఏదో చిన్నపాటి పాపులర్ తప్పితే ఛాన్స్‌లు మాత్రం రావట్లేదు. ఈ జాబితాలో చెప్పుకుంటూ పోతే చాలా మందే సీనియర్, జూనియర్.. తెలుగు భామలతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అందాల భామలూ ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ముగ్గురు ముద్దుగుమ్మల పేర్లు తెగ వినపడుతున్నాయ్.. ఏ వెబ్ సైట్‌లో చూసిన కనపడుతున్నాయ్. ఆ ముగ్గురు మరెవరో కాదు.. లావణ్య త్రిపాఠీ, నివేథా థామస్, నివేథా పేతురాజ్ ఈ ముగ్గురు ఈ మధ్య పాపులర్ అవుతున్నారు. ఇదిగో ఫలానా సినిమాలో తీసుకుంటున్నారు.. అబ్బే సెకండ్ హీరోయిన్‌గా తీసుకుంటున్నారు.. అదుగో స్టార్ హీరో సరసన నటిస్తున్నారని పేర్లు మాత్రం వినిపిస్తున్నాయ్ కానీ.. ఎస్ తన సినిమాలో ఈ భామను తీసుకున్నామని కానీ.. పుకార్లు వస్తుండటంతో క్లారిటీ ఇవ్వడం కానీ ఇఆంతవరకూ ఒక్కరంటే ఒక్క నిర్మాత కూడా ఇవ్వలేదు.

లావణ్య విషయానికొస్తే..

నిన్న మొన్నటి వరకూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్‌ సాబ్’ చిత్రంలో లావణ్య త్రిపాఠి నటిస్తోందని పుకార్లు షికార్లు చేశాయ్. ఆ తర్వాత మళ్లీ అబ్బే ఆ సినిమాలో కాదు క్రిష్-పవన్ కాంబోలో వస్తున్న మూవీలో అని వార్తలు వచ్చేశాయ్. అలా వార్తలు వచ్చాయే తప్ప.. ఈ బ్యూటీని తీసుకుంటున్నట్లు నిర్మాతలు కానీ.. తాను నటిస్తున్నది నిజమే అని లావణ్య కానీ చెప్పిన దాఖలాల్లేవ్.. అప్పుడెప్పుడో ‘అర్జున్ సురవరం’ తర్వాత వినపడని పేరు.. 2020లో గట్టిగానే వినపడింది. సో.. ఇలా పుకార్లే వచ్చాయి కానీ ఈ అందాల రాక్షసికి అవకాశాలు మాత్రం రాలేదు.

నివేథా థామస్ విషయానికొస్తే..

తెలుగులో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ తన ప్రతిభను చాటుకునే వారిలో నివేథా థామస్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే తన నటన, అంద చందాలతో సినీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసి తనకంటూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెట్టుకుంది. తాజాగా ఈ భామ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‍ అలియాస్ బన్నీ హీరోగా సుకుమార్‍ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ మూవీలో సెకండ్ హీరోయిన్ చేస్తోందని వార్తలు వినిపించాయి. బన్నీ ప్రియురాలిగా కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో.. వెబ్‌సైట్స్‌లో తెగ వార్తలు వచ్చాయ్. అంతేకాదు.. ఈ రూమర్ తర్వాత కూడా మళ్లీ చాన్స్‌లు వచ్చాయని వింటున్నామే తప్ప అధికారిక ప్రకటన ఇంతవరకూ రాకపోవడం గమనార్హం. అయితే ఈమె వికీపీడియాలో పాత్రం ‘వకీల్ సాబ్’, ‘పుష్ప’లో నటిస్తున్నట్లు ఉంది కానీ క్లారిటీ ఇవ్వలేదు.

నివేథా పేతురాజ్ విషయానికొస్తే..

‘మెంటల్ మది’లో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ ‘అల వైకుంఠపురములో..’ వరకూ తన నటన చాతుర్యంతో అందర్నీ మెప్పించింది. ఈమె నటన, అందచందాలకు ఫిదా అయిన దర్శకనిర్మాతలు ఈమెకు వరుస చాన్స్‌లు ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయంతే. ఇటీవలే పవన్-క్రిష్ కాంబోలో వస్తున్న ‘విరూపాక్షి’ (వర్కింగ్ టైటిల్) నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్. పవన్ సరసన నటించేందుకు సీనియర్ హీరోయిన్ అనుష్క మొదలుకుని లావణ్య త్రిపాఠి ఇలా చాలా మందే పేర్లు తెరపైకి వచ్చాయ్.. చివరికి ఈ నివేథాను ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. దీంతో పాటు ‘పుష్ప’లో కూడా నటిస్తోందని వార్తలు వస్తున్నాయ్. మొత్తానికి చూస్తే.. ఇలా అస్తమాను వస్తున్న వార్తలను వీళ్లు ఆ న్యూస్ చదవి అభిమానులు, కుటుంబ సభ్యులు సంబరపడిపోవాలంతే కానీ అవకాశాలు మాత్రం నిల్. ఇక ముందైనా మంచి మంచి సినిమాల్లో అవకాశం వరించాలని ఆశిద్దాం.

These Beauties Got No Chance.. Only Popularity!:

These Beauties Got No Chance.. Only Popularity!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs