Advertisement
Google Ads BL

మహేశ్ మూవీతో జక్కన్న రూట్ మారిపోతుందట..!


ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాపై అధికారి ప్రకటన వచ్చేసిన విషయం విదితమే. ఈ సినిమా పాన్ ఇండియా అని.. ఇన్ని రోజులుగా దీనికోసమే వేచి చూస్తున్న ఊపిరి పీల్చుకుని ఆనందంలో మునిగి తేలుతున్నారని ఈ మధ్యే వార్తలు వినిపించాయి. ఇదే నిజమైతే.. పాన్ ఇండియా కోసం క్యూలో ఉన్న అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను దాటి మొదట వరుసలో ఉంటారని టాక్ నడిచింది. జక్కన్న మూవీతో కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని మహేశ్ కూడా గట్టి ధీమాతో ఉన్నారట.

Advertisement
CJ Advs

ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా జక్కన్న-మహేశ్ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఇప్పటి వరకూ ‘బాహుబలి’ పార్ట్-01,02 భారీ బడ్జెట్, పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ తెరకెక్కించిన.. ప్రస్తుతం అంతకుమించి అన్నట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇలా చేస్తూ పోతే లాంగ్ గ్యాప్, గ్రాఫిక్స్‌కే నెలల సమయం తినేస్తోందని.. మరీ ముఖ్యంగా సెట్స్‌కు అంతకుమంచి సమయం పడుతోందని భావించిన జక్కన్న.. మహేశ్‌తో తెరకెక్కించబోయే మూవీతో రూట్ మొత్తం మార్చేయాలని భావిస్తున్నారట.

ఇకపై.. భారీగా గ్రాఫిక్స్ కానీ.. పీరియడ్ సెటప్స్ కానీ జక్కన్న చెక్కబోయే సినిమాల్లో కనిపించవట. ఇది మహేశ్ సినిమాతోనే ఆరంభం అట. పాన్ ఇండియా మూవీ అంటే రేంజ్ చూపించడం కాదని.. హీరోయిజం మాత్రమే చూపించాలని.. పైగా బాలీవుడ్‌లో దీనికే ప్రాధాన్యమిస్తారని రాజమౌళి అనుకుంటున్నారట. అందుకే ఇకపై మాస్ మసాలాతో పాటు మహేశ్‌ను ఇది వరకూ ఏ దర్శకుడు చూపించని రేంజ్‌లో చూపించాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. మొత్తానికి చూస్తే మహేశ్ మూవీతో జక్కన్న రూట్ మార్చేయాలని ఇలా ఫిక్సయ్యారన్న మాట. అందుకే మంచి ఎలివేషన్స్‌ స్టోరీ సిద్ధం చేస్తున్నాడని వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే జక్కన్న పెదవి విప్పాల్సిందే మరి.

Rajamouli Route Change With Mahesh Movie!:

Rajamouli Route Change With Mahesh Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs