కరోనా లాక్ డౌన్ తో అందరూ ఫ్రీగానే ఉంటున్నారు. హీరో, హీరోయిన్స్ అయితే ఏ జిమ్స్ లోనో కొవ్వు కరిగిస్తున్నారు కానీ.. దర్శకులకు, మ్యూజిక్ డైరెక్టర్స్ కి, క్రియేటివ్ రైటర్స్ కి కావాల్సినంత సమయం దొరికింది. లాక్ డౌన్ తో ఖాళీగా క్రియేటివ్ ఆలోచనలకూ పదునుపెడుతున్నారు. చాలామంది దర్శకులు కథలను డెవెలెప్ చేస్తుంటే... మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త ట్యూన్స్ ని పుట్టిస్తున్నారు. స్టార్ హీరోల ఛాన్స్ లు ఎక్కడ చేజారిపోతాయో అని హడావిడిగా కథలు రెడీ చెయ్యడం, సెట్స్ మీదకెళ్ళడం, ట్యూన్స్ కట్టడం... అయితే వర్కౌట్ అవడం, లేదా తేడా కొట్టడం. కానీ ఇప్పుడు అందరికి కావాల్సిన టైం దొరకడంతో అందరూ నిదానంగా మెదడుకి పదును పెడుతున్నారు.
ఐతే పుష్ప సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్రకటించి షాకిచ్చిన పుష్ప టీం.. ఇప్పుడు మరోసారి షాకిచ్చింది. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదా పడింది. కానీ.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం పుష్ప సినిమా మ్యూజిక్ కి సంబందించిన ట్యూన్స్ చాలావరకు రెడీ చేసేసాడట. కూల్ గా తీరిగ్గా కూర్చుని పుష్ప సినిమాకి సంబందించిన సగం ట్యూన్స్ ని దేవిశ్రీ రెడీ చేసాడట.. ఈ విషయం దేవినే చెబుతున్నాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్ కరోనా లాక్‌డౌన్‌కి ముందే... ఓ పాట ప్రిపేర్ చేసి... రికార్డింగ్ చేసేసి.. సుక్కు అండ్ బన్నీకి వినిపించడం వాళ్ళు హ్యాపీగా ఫీలవడం జరిగిందట. ఇక అదే సాంగ్ తో షూటింగ్ మొదలెట్టాలనుకుంటే కరోనా అడ్డం పడిందట. ఇక పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఉన్నట్టుగా దేవిశ్రీ హింట్ కూడా ఇచ్చేసాడు. మరి ఐటమ్స్ స్పెషలిస్ట్ దేవి ఈసారి పుష్ప ఐటెం ని ఏ రేంజ్ లో ఇవ్వబోతున్నాడో.