పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత పూరి చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. అనన్య పాండే హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే పూరి జగన్నాథ్ సినిమాల్లో బోల్డ్ డైలాగులు ఉంటాయని తెలిసిందే. పూరి హీరోలకి ఆటిట్యూడ్ తో పాటు బూతులు మాట్లాడటం అలవాటే..
సూపర్ స్టార్ మహేష్ చేత కూడా పూరి ఎలాంటి డైలాగులు పలికించాడో తెలిసిందే.. అయితే ఇప్పుడు ఫైటర్ లోనూ అలాంటి డైలాగులు పుష్కలంగా ఉంటాయట. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో పలికిన మాటలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. కేవలం అలాంటి మాటల ద్వారానే యూత్ అట్రాక్ట్ అయ్యారని చెబుతుంటారు. పూరి తీసిన ఇస్మార్ట్ శంకర్ మూవీలోనూ రామ్ చేత అలాంటి మాటలు మాట్లాడించాడు పూరి.
అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ చిత్రంలో వాటి డోస్ మరింత పెరగనుందని అంటున్నారు. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఇలాంటివి కామనే అయినప్పటికీ, విజయ్ దేవరకొండ వంటి హీరో పలకడం యూత్ ని మరింత అట్రాక్ట్ చేస్తుందని అనుకుంటున్నారట. చూడాలి మరి ఏం జరగనుందో..