సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. ఎంతో బాగా ఆడతాయనుకున్న సినిమాలు ఫ్లాప్ అవడం.. అసలు ఆడటం కష్టం అనుకున్న సినిమాలు సూపర్ హిట్లు అవడం సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా జరిగే విషయమే. అయితే సినిమా ఫ్లాప్ అయ్యాక అలా ఎందుకు అయ్యిందని విశ్లేషించుకుంటారు. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన్ సినిమాల ఫ్లాపులకి కారణాలు వెతికాడట.
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అయితే డిజాస్టర్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా స్క్రిప్టు విన్నప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడట. కానీ తెర మీదకి తీసుకొచ్చినపుడు మాత్రం ఆ మ్యాజిక్ ని తీసుకురాలేకపోయాం అని చెబుతున్నాడు. పేపర్ మీద బాగా అనిపించిన సినిమా తెరమీద బాగా రాకపోవడానికి కారణం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడమే అని చెప్పాడు.
అయితే విజయ్ కారణాలు అల ఉంటే ప్రేక్షకుల రీజన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. అర్జున్ రెడ్డి పోలికల వల్లే సినిమా దెబ్బతిందనే వాళ్ళు కూడా ఉన్నారు. సినిమాలో విజయ్ గెటప్, రాశీ ఖన్నా- విజయ్ ల మధ్య వచ్చే సన్నివేశాలన్నీ అర్జున్ రెడ్డి సినిమాని గుర్తు చేయడంతో ప్రేక్షకులు ఒకరకమైన అసహనానికి గురయ్యారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.