Advertisement
Google Ads BL

నా ఆల్ టైమ్ ఫేవరేట్ యాక్టర్ అతనే..


లఘుచిత్రాల ద్వారా పాపులర్ అయ్యి ఆ తర్వాత కేటుగాడు సినిమాతో తెలుగు సినిమాకి ఎంట్రీ ఇచ్చిన భామ చాందినీ చౌదరి, ప్రస్తుతం నటుడు సుహాస్ సరసన కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. చాయ్ బిస్కట్ ద్వారా ఫేమస్ అయిన సందీప్ రాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, కమెడియన్ సునీల్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తుండడం విశేషం. తెలుగమ్మాయి అయిన చాందినీకి సినిమాల్లో వచ్చిన అవకాశాలు చాలా తక్కువ.

Advertisement
CJ Advs

అవకాశాలు వచ్చినా కూడా సెకండ్ హీరోయిన్ గానో లేదా పెద్దగా పేరు లేని సినిమాల్లో మాత్రమే కనిపించింది. క్రౌడ్ ఫండెడ్ ద్వారా నిర్మితమైన మను సినిమాలో చాందినీ నటనకి మంచి పేరు వచ్చినప్పటికీ సినిమా ఫెయిల్ అవడంతో అవకాశాలు ఎక్కువగా రాలేదు. సినిమాల్లో అవకాశం రాకపోయినా వెబ్ సిరీస్ లలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న చాందినీ, ఒకానొక ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ యాక్టర్ గురించి చెప్పింది.

చాందినీ చౌదరి ఆల్ టైమ్ ఫేవరేట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తుంది. ఆయనలా నటించడం చాలా కష్టమని చెబుతూనే ఎప్పటికైనా ఎన్టీఆర్ తో నటించాలని అనుకుంటుందట.  

He is my favourite actor..:

Chandini chowdary said, NTR is my favourite actor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs