ఓటీటీ భారీ ఆఫర్స్‌ను తిరస్కరించిన ‘83’.. థియేటర్స్‌లోనే విడుదల
ఇండియన్ క్రికెట్‌ను గతిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భారతదేశం క్రికెట్ ప్రపంచంలో రారాజుగా అవతరించింది. కపిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజయంతో చాలా మందికి క్రికెట్ ఫేవరేట్ గేమ్‌గా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ‘83’ పేరుతో వెండితెరపై ఆవిష్కరించారు డైరెక్టర్ కబీర్‌ఖాన్.
ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ స్తంభించింది. ఈ కారణంగా విడుదల కావాల్సిన ‘83’ సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలో సినిమాను డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలకానుందని వార్తలు వినిపించాయి. నిజానికి ‘83’ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేయడానికి పలు ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్స్‌తో మేకర్స్‌ను సంప్రదించాయి. అయితే నిర్మాతలు సదరు భారీ ఆఫర్స్ సున్నితంగా తిరస్కరించి ‘83’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కబీర్‌ఖాన్ మాట్లాడుతూ ‘‘‘83’ వంటి అద్భుతమైన ప్రయాణాన్ని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రూపొందించాం. ఈ దృశ్యకావ్యాన్ని థియేటర్స్‌లో వీక్షిస్తే కలిగే అనుభూతే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు తొలగి సాధారణ పరిస్థితులు నెలకున్న తర్వాతే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యానర్స్ సమర్పణలో కబీర్‌ఖాన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ పతాకంపై దీపికా పదుకొనె కబీర్‌కాన్, విష్ణు ఇందూరి, సాజిద్ నడియడ్ వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.