Advertisement
Google Ads BL

విజయ్‌ని ఇప్పుడు ట్రోల్ చేయగలరా..?


విజయ్ దేవరకొండ స్టార్ హీరో నుండి పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారాడు. కానీ విజయ్ దేవరకొండకి మనసే లేదు. అందుకే కరోనా కోసం విరాళం ఇవ్వలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ లా ఫీలవడం కాదు... వాళ్ళలా గొప్ప మనసుండాలి. అబ్బో చాలానే విజయ్‌ని అన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. కానీ విజయ్ దేవరకొండ ఇప్పుడు చేసిన పని చూసాక ఇప్పుడేమంటారు బ్రదర్స్ అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు రెచ్చిపోతున్నారు. కారణం చిరు పెద్దన్నలా కరోనా ట్రస్ట్ కి విరాళాలు సేకరిస్తూ అందరికి సహాయపడుతున్నట్లుగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా కరోనా లాక్ డౌన్ తో నష్టపోతున్న, ఉద్యోగాలు కోల్పోయిన వారికీ రెండు విధాలుగా సహాయపడడానికి కంకణం కట్టుకున్నాడు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం నా అకౌంట్ లో సరోపోయినంతగా డబ్బు లేకపోవడం వలన పెద్దగా సహాయ పడలేకపోతున్న... ఇపుడు నా కుటుంబంతో పాటుగా 35 మందికి జీతాలివ్వాల్సిన పరిస్థితి. అందుకే కరోనాతో ఇకపై ఎవరూ అంటే మధ్యతరగతి, నిరుద్యోగులెవరు బాధపడకుండా..... 1. ఉద్యోగాలు క‌ల్పించడం. 2. అవ‌స‌రార్థుల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందించ‌డం.. అని రెండు ప్రణాళికలను ప్రకటించాడు. దానికోసం ఈ రెండు ప్రాజెక్టులకు 1.3 కోట్లు కేటాయించాడు విజ‌య్. ఇక తన స్నేహితుల సాయంతో విజయ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. 

అయితే విజయ్ దేవరకొండ ఏర్పాటుచేసిన ఈ చారిటి కి అప్పుడే హీరో కార్తికేయ తన వంతు సహాయం చేసాడు. అలాగే దర్శకుడు కొరటాల శివ, పూరి జగన్నాధ్ లు కూడా విజయ్ చేసిన పనిని మెచ్చుకోవడమే కాదు.. విజయ్ చేసిన పనికి తన వంతు సహకారం అందిస్తున్నామని చెప్పారు. మరి నిన్నటివరకు విజయ్ ని అంతలా ఆదుకున్నారు.. ఇప్పుడేమంటారు చెప్పండి.

Vijay Deverakonda Fans Happy with His Charity :

Vijay Deverakonda Takes 2 Important Decisions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs