పెళ్లి తరువాత హీరోయిన్స్ అంతా సర్దుకుంటారు అనే దానికి చెక్ పెట్టింది శ్రియ. పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయిన శ్రియ పెళ్లి తరువాత కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో నటించింది. మంచి కథ దొరికితే సినిమాలు కూడా చేస్తా అంటుంది. ఈమధ్య కొంతమంది దర్శకనిర్మాతలు తనను మోసం చేసారని ఆరోపించింది.
ముందు చెప్పే కథ ఒక్కటి తీసేది ఒకటి. అందుకే ఇటువంటి కథలు వస్తుంటే వెంటనే నో చెబుతున్నాను అంటుంది. వేరే హీరోయిన్స్ ఎవరు ఐటెం సాంగ్స్ చేయడానికి ముందుకు రాని టైములోనే ఐటెం సాంగ్స్ చేశానని చెప్పింది. అలానే నేను ఏది పడితే అది ఐటెం సాంగ్ చేయలేదని ఆ పాటకు చాలా ప్రాధాన్యత ఉంటేనే చేశాను అని అంటుంది. ప్రస్తుతం శ్రియ చేతిలో ఏమి లేకపోవడం విశేషం. పెళ్లి తరువాత ఈ అమ్మడిని ఎవరు పట్టించుకోవడం లేదు.