రాజారాణి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అట్లీ చాలా తొందరగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. రాజా రాణి తర్వాత అట్లీ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టరే. చేసిన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు ఇళయదలపతి విజయ్ తోనే తీశాడు. అయితే అవన్నీ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. మొన్నటికి మొన్న వచ్చిన బిగిల్ సినిమా విజయ్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
అయితే బిగిల్ తర్వాత అట్లీ సినిమా ఎవరితో ఉంటుందనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బిగిల్ ప్రమోషన్స్ కోసం ఇక్కడికి వచ్చిన అట్లీ, ఎన్టీఆర్ తనతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని చెప్పాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పుడప్పుడే ఉండేలా లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చేస్తుండగా, తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ తో ఒప్పుకున్నట్లు తెలిసిందే. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో సినిమా ఉంటుందని వార్తలొచ్చినా అది కూడా డౌటే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
షారుక్ ఖాన్ తన తర్వాతి చిత్రం రాజ్ కుమార్ హిరానీతో హింట్ ఇచ్చిన నేపథ్యంలో అట్లీతో సినిమా ఉండదని అర్థమైపోయింది. మరి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న అట్లీ నెక్స్ట్ మువీ ఏ హీరోతో ఉండనుందో చూడాలి.