Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ హీరోయిన్‌గా స్టార్ హీరో కుమార్తె!


 

Advertisement
CJ Advs

‘అరవింద సమేత’ చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరి కాంబోలో మరో సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ చిత్రం త్రివిక్రమ్‌తోననే న్యూస్ ఆనందాన్నిస్తోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపొందుతోంది. కాబట్టి ఆయా భాషలకు సంబంధించిన ప్రముఖ కథానాయికలను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశముందని తెలుస్తోంది.

మొదట ఈ సినిమా కోసం త్రివిక్రమ్ జాన్వీకపూర్, పూజాహెగ్డేల పేర్లు పరిశీలించారని టాక్ నడిచింది. తాజాగా తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు శ్రుతి హాసన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ మధ్య కొంత కాలం పాటు అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ తరువాత శ్రుతి మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. దీంతో ఎన్టీఆర్ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ - శ్రుతి కాంబోలో ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రుతికి అవకాశం దక్కితే మరోసారి ఈ జంట ప్రేక్షకులను అలరించనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.

Star Hero Daughter in Jr NTR And Trivikram Movie:

Shruti haasan in NTR next film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs