Advertisement
Google Ads BL

‘పుష్ప’ విషయంలో విజయ్ సేతుపతి కండీషన్స్!


తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి తన భాషలోనే కాదు ఇతర భాషల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. సైరా తరువాత విజయ్ తెలుగులో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈమూవీ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇక ఈసినిమా కోసం విజయ్ భారీగా తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

Advertisement
CJ Advs

అలానే సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్నా పుష్ప సినిమాలో విలన్ గా విజయ్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు సుకుమార్ అండ్ బన్నీ. తనకు పాన్ ఇండియా అప్పీల్ ఉంది కాబట్టి విజయ్ విచిత్రమైన కండిషన్స్ పెట్టాడట. పుష్ప సినిమాను తమిళంలో రిలీజ్ చేయకూడదని...ఒకవేళ చేస్తే తన ప్లేస్ లో వేరే నటుడిని పెట్టి రిలీజ్ చేయాలనీ కండిషన్ పెడుతున్నాడట. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో రేంజ్ పెద్దది కనుక పారితోషికం కూడా 10 నుండి 12 కోట్ల వరకు అడుగుతున్నట్టు సమాచారం.

దాంతో ప్రొడ్యూసర్స్ అతనికి బదులు ఎవరైతే బాగుంటుందని అన్వేషిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం విజయ్ వైపే మొగ్గుతున్నాడు కనుక అతనితోనే మంతనాలు జరిపి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఉప్పెన తమిళ్ లో రిలీజ్ చేయరని మాట ఇచ్చిన తర్వాతే విజయ్ సేతుపతి ఆ సినిమా ఒప్పుకున్నాడట. 

Vijay Sethupathi Conditions for Pushpa Movie:

Vijay Sethupathi demands 10 to 12 crore for Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs