Advertisement
Google Ads BL

ఆ అవకాశం వస్తే శృతి దశ తిరిగినట్లే..


టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ తెలుగు సినిమాల్లో కనిపించక చాలా రోజులు అవుతుంది. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సరసన మెరిసి మంచి హిట్ ని అందుకుని ఆ తర్వాత ఆలు అర్జున్ రేసుగుర్రంలో, రామ్ చరణ్ ఎవడు లో కనిపించి మంచి విజయాలని సొంతం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ఆమెకి తెలుగులో అవకాశాలే రావడం లేదు. అయితే తాజాగా తెలుగు సినిమా అవకాశం ఆమె తలుపు తట్టనుందని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషలో ఓ సినిమా రూపొందుతుందన్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న చిత్రం ఇదే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందో ఆలోచిస్తున్నారట. మొన్నటి వరకు పూజాహెగ్డే పేరుని పరిశీలించినప్పటికీ, ఇంకా ఆప్షన్స్ కోసం వెతుకుతూ ఉన్నారట. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్, ఈ సినిమాలో కనిపించే ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా శృతి హాసన్ ని తీసుకోవాల్ని అనుకుంటున్నాడని సమాచారం.

త్రివిక్రమ్ రాసుకున్న పాత్రకి శృతి అయితే చాలా చక్కగా సరిపోతుందని భావిస్తున్నాడట. వరుసగా పరాజయాలు చవిచూస్తున్న శృతిని తీసుకోవడం ఎంతవరకు కరెక్టో త్రివిక్రమ్ కే తెలియాలి. ఇప్పటికైతే ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ సినిమాలో శృతి సెలెక్ట్ అయితే చాలా లక్కీ అనే చెప్పాలి.

If she get a chance She will be the most luckiest girl:

Shruti hasana will be the heroine for NTR in Trivikram movie..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs