Advertisement
Google Ads BL

నక్సలైట్ గా కనిపించనున్న నటి..


నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల తన రెండవ చిత్రాన్ని రానా హీరోగా తెరకెక్కిస్తున్నాడు. విరాటపర్వం టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడికల్ డ్రామా అని సమాచారం. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు నక్సలైట్లు చాలా ఎక్కువగా ఉండేవారు. ఆ నేపథ్యాన్ని తీసుకుని వేణు ఊడుగుల ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిదా ఫేమ్ సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs

సాయిపల్లవి ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనుందట. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ ని తీసుకున్నారని సమాచారం. ఇంతకు ముందు తెలుగు, తమిళంలో సినిమాలు చేసి, నటనలో జాతీయ అవార్డును గెలుచుకున్న ప్రియమణి విరాటపర్వంలో నటిస్తుందట.  ప్రియమణి కూడా కూడా సాయిపల్లవి లాగే నక్సలైట్ గానే కనిపిస్తుందని అంటున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అన్నీ కుదిరితే ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారు.

Heroine doing a naxalite role in..:

Priyamani doing a naxalite role in Virataparvam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs