Advertisement
Google Ads BL

లాక్డౌన్ సమయంలో తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్..


కరోనా వల్ల జనాలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. కోవిడ్ 19 వ్యాప్తి మరింత విసృతమవుతున్న నేపథ్యంలో, దాన్ని నివారించడానికి లాక్డౌన్ ఒక్కటే అసలైన ఆయుధంగా భావించి ప్రజలంతా ఇళ్లలో నుండి బయటకి రావడం లేదు. కేవలం నిత్యావసర వస్తువుల కోసం తప్ప జనాలు బయటకి రావడం లేదు. అయితే ఈ టైమ్ ని సెలెబ్రిటీలు చాలా ప్రొడక్టివ్ గా వాడుకుంటున్నారు. లాక్డౌన్ టైమ్ లో పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఛాలెంజిలను స్వీకరించి ఫోటోలని షేర్ చేస్తుంది.

Advertisement
CJ Advs

మొన్నటికి మొన్న పిల్లో ఛాలెంజిని స్వీకరించిన పాయల్, దిండుతో తన అందాలని కప్పేసుకుని ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. అంతే కాక ఇంకాస్త కొత్త రకంగా ఆలోచిస్తూ, పేపర్ డ్రెస్ లో కనబడి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇటు గ్లామర్ తో అభిమానులని కవ్విస్తూనే తన తెలుగు సినిమాలలో భవిష్యత్తు కోసం తెలుగు నేర్చుకుంటుందట. పంజాబీ భామ అయిన పాయల్ కి తెలుగు సరిగ్గా రాదు. ఇప్పటి వరకు నటించిన సినిమాల ద్వారా ఆమె నేర్చుకున్నది తక్కువే.

అయితే తెలుగు రాకపోవడం వల్ల ఆమెకి అవకాశాలు రాకపోవడమే కాదు ఇండస్ట్రీలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అందుకే ఈ లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా తెలుగు నేర్చుకోవడానికే కేటాయించిందట. ఆన్ లైన్ కోర్సు ద్వారా తెలుగు నేర్చుకునే పనిలో పడిందట. మరి తెలుగు నేర్చుకున్న తర్వాతైనా పాయల్ కి అవకాశాలు వస్తాయా లేదా చూడాలి.

heroine learning Telugu in Lockdown days:

Payal Rajput learning Telugu language
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs