Advertisement
Google Ads BL

‘పుష్ప’లో మాంచి పాత్ర పట్టిందట..!


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కబోయే ‘పుష్ప’ సినిమా ఫస్ట్ లుక్‌తోనే పాన్ ఇండియా లెవల్‌లో అల్లాడించారు. అస్సలు అనుమానమేదీ లేకుండా పుష్ప సినిమాని పాన్ ఇండియా ఫిలింగా ప్రకటించి షాకిచ్చిన సుక్కు అండ్ బన్నీ లు ఈ సినిమాపై భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు. అందుకే సినిమాని భారీ లెవల్లో భారీగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే పుష్ప కథలో పుష్ప కేరెక్టర్ లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనబడతాడని, పుష్ప స్టోరీ రివెంజ్ డ్రామాగా ఉండబోతుంది అని, హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో పోలీస్ అధికారిగాను కాదు.. డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతుంది అనే ప్రచారం ఉండగా.. మిగతా నటుల ఇన్‌ఫర్మేషన్ ఎక్కడా లేకపోయినా.. బాలీవుడ్ హీరో ఒకరు ఈ సినిమాలో విలన్ కేరెక్టర్ వేస్తారని అంటున్నారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా నటనలో అదరగొడుతూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ స్టార్ హీరో అవకాశాలు పట్టలేకపోతున్న... నివేత థామస్ పుష్ప లో ఓ కీలక పాత్ర చేస్తుంది అని అంటున్నారు. గత కొన్నాళ్లుగా నివేత థామస్ చాలా సినిమాల్లో కథను మలుపుతిప్పే పాత్రలు చేస్తుంది. అందులోనూ తెగ హైలెట్ అవుతుంది. తాజాగా పుష్ప లోను అల్లు అర్జున్ లవర్ అదేనండి గర్ల్ ఫ్రెండ్ గా నివేత థామస్ కనిపించబోతుంది. ఈ సినిమాలో నివేత థామస్ పాత్ర ఎంతో కీలకమైందిగా చెబుతున్నారు. మరి అల్లు అర్జున్ లవర్ గా నివేత మరోసారి మంచి కేరెక్టర్ పట్టినట్టే. 

One More Heroine In Nivetha thomas :

Nivetha thomas Key role in Pushpa Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs