Advertisement
Google Ads BL

సడన్‌గా ఈ షాకింగ్ డెసిషన్ ఏంటి నయన్!


సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి నటన పరంగా ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ‘నాకు నేనే పోటీ.. నాకు నేనే సాటి’ అన్నట్టుగా నటించేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నటించమంటే జీవించేస్తుందంతే. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మొదట ఈ బ్యూటీనే సంప్రదిస్తుంటారు. రొమాన్స్‌తో పాటు దేవుళ్ల సినిమాల్లో ఇప్పటి వరకూ పలు పాత్రల్లో నటించి మెప్పించిన ఈ అందాల భామ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘నరసింహా’ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ‘నీలాంబరి’గా నటించిన రమ్యకృష్ణను ఇప్పటికీ ఎప్పటికీ మరిచిపోలేరు. ఇప్పుడు కూడా టిక్‌టాక్, వాట్సాప్ స్టేటస్‌లలో రజనీ-రమ్య మధ్య పంచ్ డైలాగ్స్ దర్శనమిస్తుంటాయ్.

Advertisement
CJ Advs

నీలాంబరి తరహాలో..!

ఈ పాత్రలో రమ్యకృష్ణ ఏ రేంజ్‌లో నటించి మెప్పించి మూవీ చూసినోళ్లకే అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రమ్య కెరియర్‌లో ఈ పాత్ర చెప్పుకోదగ్గదిగా మిగిలిపోయింది. అయితే ఇలాంటి తరహా పాత్రలోనే చేయాలని లేడీ సూపర్ స్టార్ నయనతార నటించాలని భావిస్తోందట. ఇటీవలే ఓ మలయాళ సినిమాకు సైన్ చేసిందట. అందులో ‘నీలాంబరి’ తరహా పాత్ర ఉంటుందట. సొంతగడ్డ కావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా ఎలాంటి పాత్ర అయినా సరే చేస్తానని ఒప్పేసుకుందట. అంతేకాదండోయ్ పారితోషికం కూడా పెద్దగా డిమాండ్ చేయలేదట. ఇది ప్రొడ్యూసర్స్‌కు మంచి తియ్యటి శుభవార్తే అన్న మాట.

ప్రమోషన్స్‌కు వస్తున్నా!

ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పటి వరకూ ఈ బ్యూటీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ప్రమోషన్స్‌కు మాత్రం అస్సలు వెళ్లదు. మెగాస్టార్ చిరంజీవి సరసన నటించినా.. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించినా సరే ప్రమోషన్స్‌కు మాత్రం వెళ్లలేదు.. వెళ్లదు కూడా. అయితే సొంతగడ్డకు సంబంధించిన సినిమా అనే సరికి ప్రమోషన్స్‌కు కూడా ఒప్పుకుందట. మరి ఇది ఇలాగే కోలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు కంటిన్యూ అవుతుందో లేదో. అంటే పారితోషికం పట్టించుకోకపోవడం.. ప్రమోషన్స్‌ వస్తానని చెప్పడంతో వామ్మో.. సడన్‌గా నయన్ ఈ షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకుందో అని అభిమానులు, సినీ ప్రియులు.. అటు కోలీవుడ్, ఇటు మల్లూవుడ్ ఆశ్చర్యపోతోందట. ఎంతైనా మార్పు మన మంచికే అని నయన్ అనుకుందేమో మరి.

Nayantharas Shocking Decision On Movies!:

Nayantharas Shocking Decision On Movies!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs