Advertisement
Google Ads BL

‘మైత్రీ’ నుంచి భారీ బడ్జెట్ మూవీస్ ఉండవ్!?


‘మైత్రీ’ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ గురించి ప్రత్యేకించీ మరీ చెప్పనక్కర్లేదు. ‘శ్రీమంతుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ సంస్థ ఇప్పటి వరకూ ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలను నిర్మించి రికార్డ్ సృష్టించింది. అయితే ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘డియర్ కామ్రేడ్’, ‘నాని గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాల ప్లాప్‌తో భారీగానే దెబ్బ పడింది కూడా. ప్రస్తుతం బన్నీ హీరోగా వస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లతో సినిమాలు నిర్మించడానికి డేట్స్ కూడా లాక్ చేసి అడ్వాన్స్ ఇచ్చుకుంది. అధికారికంగా వీటిలో కొన్నే వెల్లడించినప్పటికీ చాలా వరకు లోలోపలే జరిగిపోయాయ్. 

Advertisement
CJ Advs

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ, ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సుకుమార్, కొరటాల శివతో చాలా మందే క్యూలో ఉన్నారు. వీరిలో దాదాపు అడ్వాన్స్‌లు కూడా ఇవ్వడం అయిపోయింది. అయితే వీటిలో చాలా వరకు ఇప్పట్లో జరగవని.. ఒకవేళ సినిమాలు తెరకెక్కించిన తెలుగువరకే అని టాక్ నడుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇకపై భారీ బడ్జెట్ సినిమాల జోలికి అస్సలే పోకూడదని ఈ సంస్థ యాజమాన్యం డిసైడ్ అయ్యిందట. ఒకవేళ నిర్మించినా ఒకేసారి రెండు మూడు సినిమాలంటే ఇప్పట్లో కుదరదట.

ఎందుకంటే దీనంతటికీ కారణం కరోనా దెబ్బేనట. అందుకే ఇకపై తెలుగు వరకే నిర్మించాలని ‘మైత్రీ’ భావిస్తోందట. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి సినిమాలు రిలీజ్ కావాల్సినవి.. షూటింగ్‌లు చాలానే జరిగేవి. కరోనా దెబ్బతో మొత్తం ప్లాప్ అయ్యింది. అంటే ఈ నిర్మాణ సంస్థ నుంచి చాలా సినిమాలో బయటకెళ్లిపోతాయేమో మరి. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

No Heavy Budget Movies From Mythri Movies!?:

No Heavy Budget Movies From Mythri Movies!?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs