Advertisement
Google Ads BL

ఆ సినిమా చేసి చేతులు కాల్చుకున్న కమెడియన్


రెండు పడవలు మీద కాళ్లు వేయటం అంత మంచిది కాదు అనే ఉదాహరణకు బలం చేకూర్చాడు ఈ కమెడియన్. కమెడియన్ గా మంచి ఇమేజ్ సంపాదించుకుని తనకంటూ ఫాలోయింగ్ తెచ్చుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ గా మంచి సినిమాలు చేస్తున్న టైములో హీరోగా సినిమాలు తీసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు కానీ ఆ తరువాత ఒకేసారి ద‌ర్శ‌కుడు, నిర్మాత అవతారం ఎత్తాడు.

Advertisement
CJ Advs

తన మిత్రులైన కమెడియన్స్ అందరిని కలుపుకుని భాగ్య‌న‌గ‌రంలో గ‌మ్మ‌త్తు అనే సినిమా చేశాడు. సినిమా అయితే తీశారు కానీ అది వచ్చిన సంగతి తెలియదు వెళ్లిన సంగతి కూడా ఎవరికి తెలియదు. లేటెస్ట్ ఇంటర్వ్యూ లో శ్రీనివాస్ రెడ్డి ఈసినిమా గురించి ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఈ సినిమా అనుకోని ప‌రిస్థితుల్లో చేశాన‌ని.. దీని వ‌ల్ల డ‌బ్బుతో పాటు పేరు కూడా పోయిందని ఇంటర్వ్యూ లో తన ఆవేదన వ్యక్తం చేసాడు. పెట్టిన డబ్బులు అన్ని పోవడంతో పాటు ఇండ‌స్ట్రీలో చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింద‌ని శ్రీనివాస‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. చూసిన ప్రేక్షకుల నుండి ఫీడ్ బ్యాక్ చాలా దారుణంగా వ‌చ్చింద‌ని శ్రీనివాస‌రెడ్డి తెలిపాడు. స‌మీప భ‌విష్య‌త్తులో తాను మ‌ళ్లీ ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశం లేన‌ట్లే అని అత‌ను స్ప‌ష్టం చేశాడు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి చేతిలో సినిమాలు అంతగా ఏమి లేకపోవడం విశేషం.

Comedian Srinivas Reddy Talks about bhagyanagara veedhullo gammattu:

bhagyanagara veedhullo gammattu Closed me Says Srinivasa Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs