చరణ్.. తారక్‌లు స్నేహితులవ్వడం అడ్వాంటేజ్!!
రాజమౌళి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేసిన దగ్గరనుండి RRR అంటూ సినిమా ప్రకటన చేసే వరకు అందరిలో ఎక్కడలేని క్యూరియాసిటీ. ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి RRR మూవీ అంటే మాటలు కాదు. ప్రస్తుతం 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న RRR మూవీ కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్ వాయిదా పడింది. దానితో రాజమౌళి మీడియాకి అందుబాటులోకి రావడం.. రోజూ RRR ముచ్చట్లను మీడియాతో పంచుకోవడం చేస్తున్నాడు. తాజాగా RRR సినిమా అనుకున్న తర్వాత షూటింగ్ కి ముందు జరిగిన ముచ్చట్లు చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చి స్టార్ హీరోలు. అలాంటి సినీనేపథ్యం ఉన్న వారితో విడివిడిగా బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన నేను.. వీరిద్దరితో ఒకేసారి పనిచేస్తున్నాను. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ముందే స్నేహితులు కావడం.. ఇప్పుడు నా RRR కి అడ్వాంటేజ్ గా మారింది.
ఇక RRR మూవీ సెట్స్ మీదకి వెళ్ళాక ముందే ఎంతో గ్రౌండ్ వర్క్ జరిగింది అని... RRR మూవీ గురించిన ఆలోచన ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి చెప్పగానే వాళ్లిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, ఇక సెట్స్ మీదకెళ్ళక ముందు మేము కేరెక్టర్స్ డిజైనింగ్ సెషన్స్ లో పాల్గొన్నామని... కేరెక్టరైజేషన్ కి సంబందించిన స్కెచెస్ గీసామని.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారని.. ఇక సెట్స్ మీదకెళ్ళాక మరో ఆలోచన లేకుండా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నామని.. మధ్యలో కరోనా అడ్డం పడకపోతే... RRR షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేదని చెబుతున్నాడు రాజమౌళి.
Advertisement
CJ Advs
SS Rajamouli talks about RRR Movie:
Ram Charan and Tarak Main Advantage to RRR Says Rajamouli
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads