Advertisement
Google Ads BL

చిరు ‘లూసీఫర్‌’ రీమేక్ వెనుక ప్రభాస్ కీలకపాత్ర!?


టైటిల్ చూడగానే.. అవునా మెగాస్టార్ చిరంజీవి సినిమాకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌‌కు సంబంధమేంటి..? కొంపదీసి ఈ సినిమాలో ఇద్దరూ కలిసి నటిస్తారా..? లేక ఇంకేమైనా ఉందా..? రీమేక్ చేయమని డార్లింగే చెప్పాడా ఏంటి..? అనే సందేహం కలుగుతోంది కదూ.. ఈ మొత్తం వ్యవహారం ఉన్నది ప్రభాసే.. అదెలాగో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

Advertisement
CJ Advs

మెరుగులు దిద్దే పనిలో..!

మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ కొనేసిన సంగతి తెలిసిందే. మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. దీంతో మెగాస్టార్‌ను పెట్టి ఈ సినిమాను రీమేక్ చేయాలని చెర్రీ భావించి హక్కులు కొనేశాడు. వాస్తవానికి కొరటాల శివతో తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ కంటే ముందే సినిమా పట్టాలెక్కాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. అయితే.. ఈ మూవీనే 153 సినిమా ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరునే స్వయంగా చెప్పేశారు. ‘సాహో’ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నట్లు దాదాపు క్లారిటీ కూడా వచ్చేసింది. ఆయన ప్రస్తుతం కథకు మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రభాస్ రెండు సలహాలు..!

అసలు విషయానికొస్తే.. డైరెక్టర్స్ విషయంలో చాలా రోజులు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయ్ అయితే వీరిలో ఎవర్ని ఫైనల్ చేయాలో..? ఎవరి చేతిలో సినిమా పెట్టాలో ? చెర్రీకి అర్థం కాలేదు. ఈ క్రమంలో ప్రభాస్ మంచి అదిరిపోయే సలహా ఇచ్చాడట. ‘డార్లింగ్.. సుజిత్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడు.. ఆయన రేంజ్ ఏంటో నీకే తెలుస్తుంది’ అని చెర్రీతో ప్రభాస్ చెప్పాడట. అంతేకాదు.. సినిమా రీమేక్ హక్కులు కొనమని.. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సెట్ అవుతుందని కూడా ప్రభాసే చెప్పాడనే టాక్ కూడా నడుస్తోంది. అంటే రీమేక్ చేయమన్నది ఆయనే.. వాస్తవానికి చెర్రీ-ప్రభాస్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఒక వేళ ప్రభాసే ఆ సలహా ఇచ్చాడన్నా.. ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించాడన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.!

Prabhas connection to Chiranjeevi Lucifer remake?:

Prabhas connection to Chiranjeevi Lucifer remake?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs