Advertisement
Google Ads BL

పూరీ జగన్‌‌కు రేణు రెక్వెస్ట్.. ఛాన్స్ ఇస్తాడా!?


కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో చిత్రవిచిత్రాలుగా ఛాలెంజ్‌లు.. సోషల్ మీడియాలో లైవ్‌లు ఇస్తూ సెలబ్రిటీలు ఎప్పుడో జరిగిన విషయాలను.. సినిమాల గురించి మాట్లాడేసుకుంటున్నారు. అభిమానులతో అలరిస్తూ.. నటీనటులు ఇళ్లలో గడిపేస్తున్నారు. అయితే.. తాజాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఫేస్‌బుక్ లైవ్ లోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ‘బద్రి ’సినిమాతో రేణును ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ లైవ్‌లోకి వచ్చాడు. ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసలు బద్రీ సినిమాలో ఏం జరిగింది..? ఫస్ట్ హీరోయిన్ రేణును అనుకుని ఆ తర్వాత  ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన అమీషా పటేల్‌ను ఎందుకు తీసుకున్నారు..? ఫస్ట్ పూరీ ఏం చెప్పాడు..? ఆ తర్వాత ఏం చేశాడనే విషయాలన్నీ రేణు బయటపెట్టింది.

Advertisement
CJ Advs

ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇదీ..

రేణు : బద్రి మూవీలో నన్ను మెయిన్ హీరోయిన్‌గా తీసుకుంటానని చెప్పి..  అమీషా పటేల్‌ను తీసుకున్నారు.  అలా  అప్పట్లో మీరు నన్ను పూరీ చీట్ చేశారు.

పూరీ : రియాక్ట్ అవుతూ.. ఇదంతా పవన్ కల్యాణ్ సారే చేశారు మేడం. ఆ తర్వాత నేను డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా చేయమని ఆపర్స్ ఇచ్చాను. మీరే చేయలేదు.

రేణు : నవ్వుతూ సరే సార్ మీ నెక్ట్స్ సినిమాల్లో అయినా అవకాశమివ్వండి.. (రెక్వెస్ట్)

పూరీ : నవ్వుతూ... సైలెంట్‌గా ఉండిపోయాడు

రేణు : పూరీ మాట్లాడుతుండగానే మధ్యలోనే కలుగజేసుకున్న రేణు.. మీ మూవీలో ముసలమ్మ పాత్ర అయినా చేస్తాను.

పూరీ : మేడమ్.. మీకు అలాంటి పాత్రలు ఇస్తే నన్ను తింటుకుంటారు.. మీ ఫ్యాన్స్ కొడతారు.. అని నవ్వుతూ చెప్పాడు. 

రేణు: పర్వాలేదు నాకు కొద్దిరోజుల్లో 40 ఇయర్స్ వస్తాయి.. అలాంటి తల్లి రోల్స్ చేయొచ్చు తప్పేం లేదు.

మొత్తానికి చూస్తే.. చాలా రోజుల క్రితం జరిగిన ఈ విషయాలన్నింటినీ రేణు, పూరీ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో పూరీ బిజిబిజీగా ఉన్నాడు. ఏదో ఒక సినిమాలో మంచి పాత్ర ఇస్తే రేణు కోరిక నెరవేరుతుంది. మరి ఆమె ఇంతలా రెక్వెస్ట్‌ చేసినందుకు అయినా పూరీ అవకాశమిస్తాడో లేదో వేచి చూడాలి మరి.

Renu Desai Request Director Puri Jagannadh!:

Renu Desai Request Director Puri Jagannadh!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs