Advertisement
Google Ads BL

రవితేజకు త్రిష గ్రీన్ సిగ్నల్.. ఎందుకిలా!?


సీనియర్ నటి, అందాల భామ త్రిష తీసుకున్న నిర్ణయానికి అటు తమిళ, ఇటు తెలుగు అభిమానులు ఆలోచనలో పడ్డారు. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో త్రిషను తీసుకోగా.. రెండ్రోజులకే అబ్బే తాను నటించట్లేదని కారణం ఇదీ అని వగైరా చెప్పి ఎవరూ ఊహించని విధంగా షాకిచ్చింది. దీంతో హిట్ జోడి కలిసి నటిస్తోందన్న అభిమానుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆ తర్వాత ఈ వ్యవహారంపై ‘ఆచార్య’ దర్శకనిర్మాతలు స్పందించకపోయినా.. చిరు మాత్రం ఓ ఇంటర్వ్యూ వేదికగా దీనిపై క్లారిటీ ఇచ్చుకున్నారు. 

Advertisement
CJ Advs

అప్పుడలా.. ఇప్పుడిలా..!?

అప్పట్లో చిరంజీవి సరసన నటించడానికి ఏవేవే సాకులు చెప్పి సడన్‌గా తప్పుకుని.. ఇప్పుడు మాత్రం మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో, టాలీవుడ్, కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించాలని త్రిషను సంప్రదించగా కచ్చితంగా చేస్తానని మాటిచ్చిందట. వాస్తవానికి చిరుకే నో చెప్పింది కదా.. తాము సంప్రదిస్తే పరిస్థితేంటని ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ అడగ్గా ఇలా కథ కూడా వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకనిర్మాతలు ఆనందంలో మునిగితేలున్నారట.

స్పందన లేదేం..!?

ఇందులో నిజానిజాలెంత..? త్రిష ఎందుకిలా చేసింది..? రవితేజ మూవీకి నిజంగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..? చిరులో లేనిదేంటి..? మాస్ మహారాజ్‌లో ఉండేదేంటి..? అని నెట్టింట్లో మెగాభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా 2008లో వచ్చిన ‘కృష్ణ’ చిత్రంలో త్రిష నటించి మెప్పించింది. మరి తాజాగా వస్తున్న పుకార్లపై సోషల్ మీడియా వేదికగా అయినా రియాక్ట్ అవుతుందా లేకుంటే ఎలాగో నటిస్తున్నానుగా రియాక్ట్ అవ్వడమెందుకు..? అని సైలైంట్‌గా ఉండిపోతుందో..? వేచి చూడాల్సిందే.

Trisha Green Signal To Raviteja.. What Happens..!:

Trisha Green Signal To Raviteja.. What Happens..!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs