టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం కలపని స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. లారీ డ్రైవర్ గా బన్నీ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఊరమాస్ లుక్ లో బన్నీ రంగస్థలంలో రామ్ చరణ్ ని గుర్తుచేశాడు. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న లుక్ కూడా రంగస్థలంలో సమంత లుక్ ని పోలి ఉంటుందట.
అయితే ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ గురించి చర్చ నడుస్తుంది. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమయిన నివేధా థామస్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ లవర్ గా నివేథా థామస్ కనిపిస్తుందని అంటున్నారు. ఇప్పటికైతే ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ, ఆ దిశగా ఆలోచిస్తున్నారని సమాచారం.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పుష్పలో అవకాశం వస్తే నివేధాకి మంచి ఛాన్స్ లభించినట్టే అని చెప్పాలి. మరి ఆ అదృష్టం నివేధాకి వస్తుందో లేదో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.