Advertisement
Google Ads BL

కేటీఆర్‌‌కు చెక్స్ అందజేసిన రాజశేఖర్ కుమార్తెలు


తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెల విరాళం రూ.2 లక్షలు

Advertisement
CJ Advs

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెండో కుమార్తె, ‘దొరసాని’ సినిమాతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 22). ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను ఆమె విరాళంగా ఇచ్చారు. అలాగే, రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ మరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ రోజు ఉదయం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో సమావేశం అయ్యారు. ఆయనకు చెక్స్ అందజేశారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్’’ అని అన్నారు.

Dr. Rajasekhar daughters donate Rs 2 lakh to Telangana relief fund:

Today (April 22) is the birthday of Shivathmika Rajasekhar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs