Advertisement
Google Ads BL

చిరు రీమేక్ మూవీలో హీరోయిన్ ఉండదా!?


మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ కొనేసిన సంగతి తెలిసిందే. మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. దీంతో మెగాస్టార్‌ను పెట్టి ఈ సినిమాను రీమేక్ చేయాలని చెర్రీ భావించి హక్కులు కొనేశాడు. వాస్తవానికి కొరటాల శివతో తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ కంటే ముందే సినిమా పట్టాలెక్కాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. అయితే.. ఈ మూవీనే 153 సినిమా ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరునే స్వయంగా చెప్పేశారు.

Advertisement
CJ Advs

‘సాహో’ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నట్లు దాదాపు క్లారిటీ కూడా వచ్చేసింది. ఆయన ప్రస్తుతం కథకు మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ‘లూసిఫర్’ మూవీలో మోహన్ లాల్ సరసన హీరోయిన్ లేదు.. సింగిల్ గానే నడిపించేశాడు దర్శకుడు.. మరి తెలుగులో పరిస్థితేంటి..? ఇక్కడ యథావిధిగా ట్రాక్ నడిపించేస్తాడా..? లేకుంటే హీరోయిన్ ఉంటుందా..? అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

తాజాగా.. మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. చిరు కమర్షియల్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్‌ను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. అయితే కథ మొత్తం వివరించిన తర్వాత సెట్ కాకపోతే ఇంటర్వెల్‌కు ముందు ఒక టైటిల్ సాంగ్.. ఆ తర్వాత ఒక ఐటెం సాంగ్‌తోనే సినిమా నడిపించేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. ఈ రెండింటిలో ఏదైనా సరే చిరు ఒప్పుకుంటేనే ముందుకెళ్లాలని సుజిత్ భావిస్తున్నాడట. వాస్తవానికి ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి.. సాంగ్స్ లేకుంటే పరిస్థితేంటి..? చిరు మనసులో ఏముంది..? పైన చెప్పిన రెండు డీల్స్‌లో చిరు దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే మరి.

News About Chiranjeevi Remake Movie Heroine!:

News About Chiranjeevi Remake Movie Heroine!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs