Advertisement
Google Ads BL

బన్నీ నేర్చుకోవడంలో బిజీగా ఉన్నాడు..


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అతడు బాగా కష్టపడుతున్నాడట. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. బన్నీకి తెలుగుతో పాటు మళయాలంలోనూ మంచి క్రేజ్ ఉంది. బన్నీ సినిమాలన్నీ అక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి.

Advertisement
CJ Advs

ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్తూరు జిల్లా ప్రాంత నేపథ్యంలో సాగుతుందట. అందుకోసం ఈ సినిమాలో ఎక్కువ మందిని చిత్తూరు జిల్లా నటులనే తీసుకున్నారు. అంతే కాదు పుష్ప కోసం బన్నీ చిత్తూరు జిల్లా యాసని నేర్చుకుంటున్నాడు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చేత గోదావరి యాస పలికించిన సుకుమార్, ఈ సినిమాలో బన్నీచేత చిత్తూరు యాసని మాట్లాడిస్తున్నాడు.

అందుకోసం బన్నీ ఈ యాసని నేర్చుకుంటున్నాడట. ఈ లాక్డౌన్ సమయంలో ఆ యాసపై పట్టు సంపాదించడానికి కృషి చేస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

Allu Arjun is busy with learning..:

Allu Arjun busy with learning Chittoor dialect
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs