Advertisement
Google Ads BL

‘దేవదాసి’గా మారుతున్న అనసూయ!?


అనసూయ భరద్వాజ్.. ఇటు బుల్లి తెరపై.. అటు వెండి తెరపై ఓ మెరుపు మెరుస్తోంది. వీటితో పాటు సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత కూడా. దీంతో ఓ హీరోయిన్ రేంజ్‌లో ఈ హాట్ యాంకరమ్మకు ఫాలోయింగ్.. ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ఈ హాట్ భామ మంచి మంచి పాత్రల్లోనే సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’, ‘యాత్ర’ సినిమాలోని పాత్రలు బహుశా మున్ముంథు ఎప్పుడూ రావేమో. అలాంటి పాత్రల్లో నటించి మెప్పించి ఆదరాభిమానులు పొందింది. ఈ పాత్రలు చూసిన తర్వాతే చాలా మంది పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఆణిముత్యాల్లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌ని అల‌రించిన కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ను తెరకెక్కిస్తున్న విషయం విదితమే. అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రకు ఎవరైతే సెట్ అవుతారా..? అని చూసిన ఆయన.. అనసూయ గురించి విని.. ఆమె నటించిన పాత్రలు చూసి ఫిదా అయ్యారని.. దీంతో పిలిచి మరీ అవకాశమిచ్చారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతవరకూ అధికారిక ప్రకటన రాలేదు కానీ.. తాజాగా ఏకంగా ఆమె పాత్రే లీకయ్యింది. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవదాసి అంటే.. గుడిలోనే ఉంటూ దేవుడి ఉత్సవాల్లో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ అన్నమాట. ఈ పాత్రలో అనసూయ నటిస్తోందట. గుడిలోనే ఓ ప్రత్యేకపాట కూడా ఉంటుందట. ఇదే నిజమైతే అనసూయ చాలా పద్ధతిగా కనిపిస్తుందన్న మాట.

ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ, అనసూయ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే బిగ్‌బాస్ విన్నర్, సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్‌ను తీసుకుంటున్నట్లు కృష్ణవంశీ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. ప్రకాష్ రాజు కుమార్తెగా.. రాహుల్ సిప్లిగంజ్ జోడీగా యాంగ్రీ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తోందని కూడా వార్తలు వినిపించాయి.

Anchor Anasuya Turns As A Devadasi!:

Anchor Anasuya Turns As A Devadasi!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs