Advertisement
Google Ads BL

ఈ నలుగుర్నీ మించి మహేశ్ జెండా పాతేస్తాడా!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కుర్రకారులో.. అందులోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నప్పటికీ మహేశ్ మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా.. పాన్ ఇండియా మూవీ చేయలేదు.. ఎప్పుడు ప్రకటించలేదు కూడా. ఎందుకో ఈ ఒక్క సాహసం తప్ప.. చేయాల్సినవన్నీ చేసేశాడు. దీంతో అభిమానుల్లో ఆ కొరత అలాగే ఉండిపోయింది. అయితే తాజాగా ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న ప్రకటనతో.. హమ్మయ్యా తమ అభిమాన హీరో కూడా రేసులోకి వచ్చేశాడు.. ఇక పాన్ ఇండియానే అని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుని ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Advertisement
CJ Advs

రేసులో ఉండేది వీళ్లే..

వాస్తవానికి ఇదే మహేశ్ బాబుతో పాటు టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు పాన్ ఇండియా కోసం చాలా రోజులుగా భగీరథ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్కవుట్ అవ్వలేదు. అయితే.. ఇప్పుడు చాలా మంది సిద్ధమైపోయారు. వారిలో ‘పుష్ప’ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రిష్ మూవీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా బరిలో ఉన్నారు..

సత్తా చాటేదెవరో..

వీరిలో ఎవరు పాన్ ఇండియా క్రేజ్‌ను సంపాదించుకుంటారో అనేదానిపై అటు సోషల్ మీడియాలో.. ఇటు అభిమానుల్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. అయితే మహేశ్ మాత్రం జక్కన్న మూవీతో కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని గట్టి ధీమాతో ఉన్నాడు. మరోవైపు పైన చెప్పిన మిగిలిన హీరోలు కూడా అదే ధీమాతో ఉన్నారు. ఫైనల్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి సత్తా చాటెదెవరో.. మరీ ముఖ్యంగా ఇప్పటికే టాలీవుట్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను మించిపోయి.. మార్కెట్‌ను కొల్లగొట్టి ఆ స్టార్ ఇమేజ్ ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాలంటే సినిమాలన్నీ విడుదలయ్యేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.

Intresting News About Superstar Mahesh Babu:

Intresting News About Superstar Mahesh Babu  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs