Advertisement
Google Ads BL

‘పుష్ప’ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్స్..!


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ - హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఏప్రిల్-08న అన్ని వివరాలు అధికారంగా వెలువడ్డాయ్. సినిమా టైటిల్, ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్ అన్నీ వచ్చేశాయి. సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్‌ ఖరారు చేయగా ముందుగా అనుకున్నట్లే ఇది ఎర్రచందనం నేపథ్యంతో సాగే కథే అని తాజాగా మరోసారి తేలిపోయింది. మరోవైపు.. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల‌తో ఓరల్‌గా పాన్ ఇండియా చిత్రంగా ‘పుష్ప’ విడుద‌ల కాబోతోంది. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. పోస్టర్స్ చూసిన జనాలంతా చిత్రవిచిత్రాలుగా మాట్లాడేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా.. సినిమాకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అదిరిపోయే అప్డేట్స్ అందాయి. ఫస్ట్ లుక్‌లోని బన్నీ డిఫరెంట్ హెయిర్ స్టైల్, రగ్డ్ లుక్‌ను బట్టి వామ్మో బన్నీ ఊర మాస్‌గా నటించబోతున్నారని జనాలు అనుకున్నారు. అయితే అది ఒక్క యాంగిలే కాదండోయ్.. వాస్తవానికి బన్నీ ఈ మూవీలో డబుల్ షేడ్స్‌లో కనిపించి మెప్పించబోతున్నాడట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. మూవీలో అల్లు అర్జున్ ‘డాన్‌’గా కూడా కనపడతారని టాక్ నడుస్తోంది. అంటే అటు మాస్.. ఇటు క్లాస్ అందరినీ మెప్పించే విధంగా సినిమా ఉంటుందన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి లేదా సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

Intresting Updates On Bunny PUSHPA Movie:

Intresting Updates On Bunny PUSHPA Movie  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs