Advertisement
Google Ads BL

కలర్స్ స్వాతి విడాకులపై వచ్చిన క్లారిటీ!!


హీరో నిఖిల్‌తో ప్రేమాయణం నడుపుతున్న కలర్స్ స్వాతి అని ప్రచారం జరుగుతున్న టైమ్‌లో స్వాతి సడన్ గా వికాస్ అనే కుర్రాడిని పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది. నిఖిల్ - స్వాతి రెండు మూడు సినిమాలల్లో కలిసి పని చెయ్యడంతో వారి మధ్యన సంథింగ్ సంథింగ్ అంటూ గాసిప్స్ రావడం.. తర్వాత స్వాతి ప్రేమించినవాడిని పెళ్ళాడి లైఫ్ లో సెటిల్ అవడంతో కథ సుఖాంతం అయ్యింది అనుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తా అని చెప్పడమే కాదు.. హాట్ హాట్ గా ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ షేక్ చేసింది. స్వాతి కి అవకాశాలు ఇచ్చేది ఎవరో తెలియదు కానీ.. ప్రస్తుతం స్వాతి మాత్రం రకరకాల హాట్ యాంగిల్స్ లో అందరిని ముగ్గులోకి దింపుతోంది.

Advertisement
CJ Advs

అయితే స్వాతి అలా సినిమా అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే స్వాతి భర్తకి విడాకులిచ్చి.. ఒంటరిగా ఉంటుంది అంటూ ఓ న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఊపందుకుంది. వికాస్ నుంచి కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇలాంటి రూమర్ స్ప్రెడ్ అవడానికి కారణం.. స్వాతి తన భర్తతో కలిసి దిగిన ఫోటోల్ని ఇన్‌స్టాగ్రామ్ నుంచి తీసేసింది. దీంతో స్వాతి విడాకుల న్యూస్ సోషల్ మీడియా కెక్కింది. తాజాగా తన విడాకుల మేటర్ పై స్వాతి స్పందించింది. స్వాతి తన భర్తతో కలిసి దిగిన చిత్రాలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ... తన స్మార్ట్ ఫోన్ లోని వాటిని చూపించింది. అలాగే ఆ ఫొటోస్ అన్నిటిని ఓ చిన్న వీడియోను తీసి... దాన్ని పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ కు హారీపోటర్ డైలాగ్ ను కామెంట్ గా పెట్టడం చూసిన వారు హమ్మయ్య స్వాతి భర్త వికాస్ తో విడిపోవడం లేదు. స్వాతి విడాకుల మేటర్ అంతా బుస్ అంటూ స్వాతి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Truth About Colors Swathi Divorce:

Colors swathi Clarity about Divorce with her Husband
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs