Advertisement
Google Ads BL

‘SR కళ్యాణమండపం’ మీమ్ పోస్టర్ విడుదల


యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘SR కళ్యాణమండపం - Est. 1975’ చిత్రం‌ మీమ్ పోస్టర్ కి అనూహ్య స్పంద‌న‌

Advertisement
CJ Advs

రాజావారు రాణిగారు సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నుంచి SR కళ్యాణమండపం - Est. 1975 అనే క్రైమ్ కామెడీ ల‌వ్ స్టోరీ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్క‌ర్ న‌టిస్తోంది. ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై రాజు, ప్ర‌మోద్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వినూత్న‌మైన టైటిల్ పెట్టి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేపిన ఈ చిత్ర బృందం తాజాగా మీమ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మీమ్స్ ఎంత పాపుల‌ర్ అయ్యాయో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే, చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సూటిగా చెప్ప‌డ‌మే కాకుండా, ఈ మీమ్స్ లో హ్యూమ‌ర్ కూడా ఉండ‌టం విశేషం. ఇదే ఫార్మాట్ ని SR కళ్యాణమండపం - Est. 1975 టీమ్ కూడా ఫాలో అయింది. తెలుగు చల‌న చిత్ర సీమ‌లో తొలిసారిగా మీమ్స్ టెంప్లేట్ ని ఉప‌యోగించి అఫిషీయ‌ల్ గా పోస్టర్ ని రిలీజ్ చేసింది. ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కాలేజీ స్టూడెంట్స్ గా న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని మ‌రోసారి ఈ మీమ్ పోస్ట‌ర్ ద్వారా ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఆడియెన్స్ కి రివీల్ చేశారు. హ్యూమ‌ర్, రొమాన్స్, ఫ‌న్ జోడించిన డైలాగ్స్ తో ఈ మీమ్ పోస్టర్ రెడీ చేశారు SR కళ్యాణమండపం - Est. 1975 టీమ్. దీంతో ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ కి సోష‌ల్ మీడియాలో అనుహ్య‌మైన స్పంద‌న రావ‌డ‌మే కాకుండా వైరల్ అవుతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో సాయికుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇక లాక్ డౌన్ పిరియ‌డ్ ముగిసిన వెంట‌నే ఈ సినిమా షూటింగ్ ని పునః ప్రాంరంభించి సాధ్య‌మైనంత త్వ‌ర‌లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో నిర్మాత‌లు రాజు - ప్ర‌మోద్ స‌న్నాహాలు చేస్తున్నారు. 

 

న‌టీన‌టులు 

కిరణ్ అబ్బ‌వ‌రం

ప్రియాంక జ‌వాల్క‌ర్

సాయికుమార్

తులసి శివమణి

అరుణ్ కుమార్

అనిల్  జీలా

కష్యప్ శ్రీనివాస్

 

టెక్నీషీయన్స్ 

సంగీతం - చేతన్ భరద్వాజ్ 

కెమెరామెన్ - విశ్వాస్ డేనియల్

నిర్మాత‌లు - రాజు, ప్ర‌మోద్

ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదె‌

Superb Response to SR kalyanamandapam Meme Poster :

SR kalyanamandapam Meme Poster released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs