Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ డేట్ మారింది...?


పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి ఆయన అభిమానులు ఎంతో అశగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్ లో నటిస్తున్నాడని ప్రకటించినప్పటి నుండి ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని చూస్తున్నారు. రెండేళ్ల తర్వాత మళ్లీ పవన్ ని తెరమీద చూసుకోవచ్చని మురిసిపోయారు. వారి ఆశలకి తగ్గట్టుగానే సినిమా యూనిట్ కూడా చిత్రంలోని పవన్ కళ్యాణ్ లుక్ ని రివీల్ చేసి అంచనాలని పెంచేసింది.

Advertisement
CJ Advs

అయితే సడెన్ గా పవన్ అభిమానులకి కరోనా రూపంలో పెద్ద షాక్ తగిలింది. కరోనా కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోవడంతో వకీల్ సాబ్ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేసినా కూడా సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశ్యంతో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తెరుచుకున్నా జనాలు థియేటర్లకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

అందువల్ల వకీల్ సాబ్ కి వేసుకున్న ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అయితే ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అప్పటి వరకు అన్నీ సర్దుకుంటాయన్న ఉద్దేశ్యంతో ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ విషయమై అధికారిక సమాచారం రానప్పటికీ చిత్రబృందం ఈ దిశగా ఆలోచిస్తుందని తెలుస్తుంది. 

vakeel saab release date changed..?:

Vakeel saab will be releasing on August 15th.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs