Advertisement
Google Ads BL

రవితేజకు మాటిచ్చిన జక్కన్న.. 2021లో మూవీ!?


ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి చేతిలో పడితో ఎలాంటి జీరో అయినా హీరో కాదు కాదు స్టార్ హీరో అయిపోతాడని సినీ ప్రియులు, ప్రేక్షకులు బాగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే జక్కన్న ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో దూకేద్దామా అని కుర్ర, సీనియర్ హీరోలు సైతం వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. ఇయర్స్ గ్యాప్ రావచ్చేమో కానీ కచ్చితంగా జక్కన్న చెక్కితే ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది.. ఇక ఆ హీరో క్రేజ్ అంబరమంత అవుతుంది. ఇదీ జక్కన్నకు ఉన్న స్పెషాలిటి. ఇందుకు చక్కటి ఉదాహరణ జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నేచురల్ స్టార్ నానీ, నితిన్‌లే. అంతేకాదండోయ్.. వీరిలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఉన్నాడు. 

Advertisement
CJ Advs

రవితేజ.. ఎలాంటి పాత్రలు అయినా అవలీలగా చేస్తుంటాడని చాలా సార్లు స్టేజ్‌ పైనే స్టార్ హీరోలు చెప్పిన సందర్భాలున్నాయ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి వచ్చాడంటే నిజంగా ఆయనకున్న టాలెంటే ఇందుకు కారణం. అలాంటి రవితేజతో 2006లో ‘విక్రమార్కుడు’ తెరకెక్కించిన జక్కన్న సూపర్ డూపర్ హిట్ చేశాడు. ఈ సినిమాతో 2006కు ముందు.. ఆ తర్వాత రవితేజ అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయ్. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమాలు అస్సలు రాలేదు. పైగా అదుగో ఇదుగో అంటున్నారే తప్ప వచ్చిందే లేదు. పైగా ఇప్పుడు రవితేజ కూడా పీకల్లోతు ప్లాప్ కష్టాల్లో ఉన్నాడు. ఈయనకు హిట్ పడి చాలా ఏళ్లే దాటిపోయాయ్. సినిమాలు అయితే హిట్, ప్లాప్ అనే తేడా లేకుండా చేస్తున్నాడే తప్ప అంత తృప్తి అయితే రవితేజకు లేదు.

అందుకే.. తనకు మళ్లీ పాత రోజులు కావాలని.. మళ్లీ తనలోని మాస్‌ను బయటికి తీయాలంటే వన్ అండ్ ఓన్లీ జక్కన్న వల్లే సాధ్యమవుతుంది. జక్కన్నా.. ఒకే ఒక్క సినిమా అంటూ రవి రెక్వెస్ట్ చేస్తున్నాడట. వాస్తవానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్న ఒకప్పుడు ఎక్కువగా నమ్మిన హీరోల్లో రవితేజ ఒకరు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. రవి అలా అడగ్గానే కచ్చితంగా చేద్దాం కానీ ఇప్పుడు కుదరదు.. 2021లో మాత్రం పక్కాగా చేద్దామని మాటిచ్చాడట.

కాగా.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు జక్కన్న. ఆ తర్వాత రవితేజతో సినిమా ఉంటుందన్న మాట. నిజంగా వీరి కాంబోలో సినిమా వస్తే ఇటు జక్కన్న అభిమానులకు.. అటు రవితేజ అభిమానులకు మామూలుగా కిక్కు ఉండదు. ‘విక్రమార్కుడు’ లాంటి మంచి హిట్ పడితే మాత్రం ఇక మాస్ మహారాజకు తిరిగి ఉండదన్న మాట. మరి మూవీ ఎప్పుడు వస్తుందో..? ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ.

Raviteja and Jakkanna Combo Repeat In 2021!:

Raviteja and Jakkanna Combo Repeat In 2021!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs