Advertisement
Google Ads BL

మే-20న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా పక్కా..!


అభిమాన హీరో పుట్టిన రోజు లేదా సినిమా రిలీజ్.. ఆడియో ఫంక్షన్స్ అంటే అభిమానుల్లో ఎంత ఆనందం ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆ రోజు కేక్స్ కట్ చేయడాలు.. సామాజిక కార్యక్రమాలు ఇలా చాలా చాలానే చేస్తుంటారు. మరీ ముఖ్యంగా నందమూరి అభిమానుల ఫ్యాన్స్ అయితే ఇంకా వెరైటీగా తాము అభిమానించే హీరోల వేడుకల జరుపుతుంటారు. ఇక అదే ఏడాది ఇక ఆ హీరో సినిమా ఉంటే ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులే ఉండవ్. మే-20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ తారీఖుతో బుడ్డోడు 36వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. అంటే నందమూరి అభిమానులకు ప్రత్యేకమైన రోజు అన్న మాట. ప్రస్తుతం కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలో ఎలాగా వేడుకలు జరపొద్దనే అభిమానులకు బుడ్డోడు సెలవిస్తాడు. అయితే.. ఇక అభిమానులను సంతృప్తి పరచడం ఎలా..? అని ఎన్టీఆర్ ఆలోచించాడట.

Advertisement
CJ Advs

‘RRR’ నుంచి ప్రోమో పక్కా!

ఈ క్రమంలో తాను ప్రస్తుతం నటించే ‘RRR’ (రౌద్రం ర‌ణం రుధిరం) సినిమాకు సంబంధించి వీడియో లేదా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయించాలని భావిస్తున్నాడట. ఎందుకంటే ఇదివరకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజున ఇలానే ఓటమెరుగుని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న వీడియోను రిలీజ్ చేశాడు. అందుకే ఎన్టీఆర్ పుట్టిన రోజు కూడా ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే బాగోదని.. వారిలో అసంతృప్తి పెరిగిపోతుందని భావించిన జక్కన్న ఇప్పటికే వీడియో రెడీ చేయించే పనిలో ఉన్నాడట. అంటే మే-20న మరో ప్రోమో వచ్చేస్తుందన్న మాట. ఇదే జరిగితే నిజంగా అభిమానుల ఆనందాన్ని ఇక పట్టలేం.

లుక్ లేదా టైటిల్!

మరోవైపు ఎన్టీఆర్ తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అనే విషయం తెలిసిందే. ఈ కాంబోలో సినిమా ఉంటుందనే ప్రకటన తప్ప ఇందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజున మూవీ లుక్ లేదా టైటిల్‌ను విడుదల చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. దీన్ని బట్టి చూస్తే.. జక్కన్న, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి నందమూరి ఫ్యాన్స్‌‌కు డబుల్ ట్రీట్ పక్కా అన్న మాట. అయితే గత రెండు మూడ్రోజులుగా అప్డేట్ లేనట్లే.. అభిమానులకు నిరాశే అని వార్తలు వస్తున్నప్పటికీ అవన్నీ పుకార్లేనని.. చెర్రీ ప్రోమో రిలీజ్ చేసి ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే అస్సలు బాగోదని జక్కన్న ఫిక్సయ్యారట. ఇక త్రివిక్రమ్ మాత్రం ఇదే సరైన సమయమని అదిరిపోయే అప్డేట్‌తో వచ్చేస్తాడట. ఇక ఆలస్యమెందుకు డబుల్ ట్రీట్‌కు.. బీ రెడీ నందమూరి ఫ్యాన్స్..!

Double Dhamaka For NTR Fans On May-20th!:

Double Dhamaka For NTR Fans On May-20th!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs